Begin typing your search above and press return to search.

మరోసారి జాతీయ కాంగ్రెస్ తో కేసీఆర్ పొత్తు..?

By:  Tupaki Desk   |   26 Sep 2022 8:45 AM GMT
మరోసారి జాతీయ కాంగ్రెస్ తో కేసీఆర్ పొత్తు..?
X
కొన్ని నెలలుగా కేసీఆర్ జాతీయ రాజకీయాల పాట పాడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను వరుసబెట్టి మరీ కలుస్తున్నారు. ఇప్పుడున్న ఎన్డీయే, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ రావాలని ప్రాంతీయ పార్టీల సీఎంలను కలుస్తున్నారు. అయితే కేసీఆర్ వెళ్లినంత సేపు బాగానే ఉంటుంది. ఆయన రాకను ఆయా రాష్ట్రాల సీఎంల సానుకూలంగా ఆహ్వానిస్తున్నారు. కానీ ఆ తరువాత కేసీఆర్ చెప్పిన మాటను పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూడో ఫ్రంట్ గురించి వివరించారు. అప్పటి వరకు ఓకే అన్న నితీశ్.. ఆ తరువాత మాట మార్చినట్లు సమాచారం. మేమంతా కాంగ్రెస్ తోనే ఉంటున్నామని.. థర్డ్ ఫ్రండ్ అనేదీ ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు సక్సెస్ గా పాలించానని చెబుతున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెడుతారని.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతున్నారని.. రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అయితే జాతీయ రాజకీయాల్లోకి పోదాం.. అని చెబుతున్న కేసీఆర్.. పార్టీ మార్పు విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.

ఈ తరుణంలో ఆయన ఇతర రాష్ట్రాల సీఎంలను కలుస్తూ వస్తున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిశారు. అయితే కేసీఆర్ ను కలిసిన తరువాత స్టాలిన్ కాంగ్రెస్తోనే ఉంటానని చెప్పారు. ఇటు ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం పూర్తిగా పడిపోయింది.

ఇక ఫోన్లో నిత్యం కాంటాక్ట్ ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మొదట్లో థర్డ్ ఫ్రంట్ అంటూ వేడి పెంచారు. కానీ ఆ తరువాత మరోసారి ఆ విషయంపై మాటెత్తడమే కాకుండా.. భవిష్యత్ లో కాంగ్రెస్ తోనే కలిసి ఉంటామని ప్రకటించారు. దీంతో మూడో ఫ్రంట్ పై ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక ఇంట్రెస్ట్ లేనట్లే తెలుస్తోంది. ఈ తరుణంలో బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ను సీఎం కలిశారు. మూడో ఫ్రంట్ పై ముచ్చటించారు. అయితే కేసీఆర్ మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు.

కానీ తాజాగా థర్డ్ ప్రంట్ సాధ్యం కాదన్నట్లు మాట్లాడారు. అంతేకాకుండా కాంగ్రెస్ తోనే ఉంటామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భవిష్యత్ తో కేసీఆర్ కూడా కాంగ్రెస్ తో కలిసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తో జతకడుతారా..? అనేది తేలాల్సి ఉంది.

అదీ గాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ముందు రాష్ట్రం ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తామన్నారు. ఆ తరువాత మాట మార్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ ను దరిచేర్చుకుంటుందా..? అనేది చర్చనీయాంశంగామారింది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది.. అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.