కథ ముగిసింది..కల చెదిరింది..కన్నీరే మిగిలింది

Mon Mar 25 2019 22:52:11 GMT+0530 (IST)

KA Paul Submitted Nomination Without Proper Documentation

 కేఏ పాల్. తెలంగాణ - ఏపీ ఎన్నికల సమయంలో ఎగసిపడిన కామెడీ సునామి. తన పంచ్ లతో హావా భావాలతో అందర్ని తెగ నవ్వించేంసిన కేఏపాల్.. చివరి నిమిషంలో మాత్రం ఆయన ఏడుస్తూ అందర్ని తెగ నవ్వించేశారు. అందరూ ఊహించినట్లుగానే ఏపీ ఎన్నికల రణ క్షేత్రంగా సైలెంట్ గా నిష్క్రమించారు. భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెండు రోజుల క్రితం నామినేషన్ వేశారు కేఏ పాల్. అయితే అఫిడవిట్ మాత్రం ఇవ్వలేదు. అఫిడవిట్ దాఖలుకి సోమవారమ చివరి రోజు. దీంతో.. ఆయన రావడం ఆలస్యమైంది. అయితే నామినేషన్ల ప్రక్రియ 3 గంటల వరకే కావడంతో.. ఆయన అప్లికేషన్ తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అందరూ అనకున్నట్లుగానే ఆయన కథ మొత్తానికి భీమవరంలో ముగిసింది.కేఏ పాల్ నామినేషన్ వేసే సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా భీమవరంలో వాగ్వాదం చోటుచేసుకుంది. నరసాపురంలో ఎంపీ నామినేషన్ ను ఆలస్యంగా తీసుకున్నారని అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్ ఆరోపించారు. ఎన్నికల్లో తాను ఎక్కడ గెలుస్తానో అన్న భయంతోనే భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్.. చంద్రబాబు - జగన్ - పవన్ కల్యాణ్ ని విమర్శించారు.  తాను భీమవరంలో పోటీ చేయలేకపోయినా నరసాపురం ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. భీమవరంలో పోటీ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానని కాసేపు వెక్కి వెక్కి ఏడ్చారు పవన్. కానీ అదేం విచిత్రమో ఆయన ఏడుస్తున్నా కనీ అందరికి నవ్వే వచ్చింది.

ఐదేళ్ల క్రితం కూడా ఇంతే. తన పార్టీ నుంచి అందరూ పోటీ చేస్తారని ప్రకటించారు. కట్ చేస్తే అభ్యర్థుల సీడీ పోయిందని సడన్‌గా మాయమైపోయారు. ఇప్పుడు భీమవరం నుంచి తప్పుకున్నారు. నరసాపురంలో అయితే నామినేషన్ వేశారు కానీ అక్కడ కూడా తిరస్కరణకు గురైతే.. పాల్ కథ సమాప్తం అయినట్లే. కేఏ పాల్ కథ కంచికి.. మనమంతా ఇంటికి.