జూబ్లీహిల్స్..గ్యాంగ్ రేప్.. సంచలన నివేదిక.. కోర్టు ఉత్తర్వులు ఇవే!

Sat Oct 01 2022 10:03:20 GMT+0530 (India Standard Time)

Jubilee Hills.. Gang Rape.. Incidental Report.. These are the court orders!

సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.ఎమ్మెల్యే కుమారుడ్ని జువైనల్గా పరిగణించాలని న్యాయస్థానం పేర్కొంది. జువైనల్ సెక్షన్ 15 ప్రకారం బోర్డు నలుగుర్ని మేజర్లుగా పరిగణించాలనే అంచనాకు వచ్చింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యులు సమీక్షించి నివేదికను వెలువరించారు.

ఈ ఘటనలో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు సాదుద్దీన్ మినహా మిగతా అయిదుగురిని మైనర్లుగా పేర్కొన్నారు. నేరం తీవ్రత దృష్ట్యా అయిదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారణ చేపట్టాలని జువైనల్ జస్టిస్ బోర్డును జూబ్లీహిల్స్ పోలీసులు కోరారు.

ఈ మేరకు నెల రోజుల క్రితం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నలుగురు మైనర్లను మేజర్లుగా జువైనల్ జస్టిస్ బోర్డు పరిగణిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఈ కేసులో అయిదో మైనర్‌పై మాత్రం అభియోగాలు తీవ్రంగా లేనందున... బోర్డు అతన్ని మైనర్‌గానే పరిగణించింది. దీంతో ఈ కేసు విచారణ జువైనల్ జస్టీస్ బోర్డు పరిధి నుంచి నాంపల్లి కోర్టుకు మారనుంది. నలుగురు మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ విచారణ చేపట్టనున్నారు.

ఏం జరిగిందంటే..మే 28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగ్గా... మే 31న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని బాలిక వాంగ్మూలం సేకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. విడతలవారిగా సాదుద్దీన్తో పాటు మరో ఐదుగురు మైనర్లను జూన్ 5న తేదీన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

రాజకీయ రంగు పులుముకోవటంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించారు.  అందులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. తగిన సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు.. కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.