ఒక్కరోజులో అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకున్న యాప్ ఇదే

Sat Apr 01 2023 10:29:54 GMT+0530 (India Standard Time)

Jio Cinema App Record Downloads on IPL

ఐపీఎల్ దెబ్బకు జియో సినిమా యాప్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీని కోసం దేశ ప్రజలంతా వెంటపడి మరీ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈసారి హాట్ స్టార్ తో ఒప్పందం ముగియడంతో ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను అంబానీ సంస్థ జియో దక్కించుకుంది. ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా జియో సినిమా యాప్ లో చూడొచ్చని ప్రకటించింది.గతంలో ఐపీఎల్ చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో నెలకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున సబ్ స్క్రిప్షన్ తీసుకొని దేశ క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ చూసేవారు. కానీ ఈసారి హాట్ స్టార్ కాకుండా హక్కులు జియో దక్కించుకుంది. దీంతో ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా జియో సినిమాలో చూడొచ్చని ఆఫర్ ఇచ్చింది.

ఐపీఎల్ తో జియో సినిమా యాప్ పంట పండింది. ఉచితంగా లైవ్ మ్యాచ్ చూసే అవకాశం ఇవ్వడంతో యాప్ డౌన్ లోడ్ చేసేందుకు క్రికెట్ ప్రేమికులు పోటీపడ్డారు.

నిన్న ఒక్కరోజే 2.5 కోట్ల డౌన్ లోడ్స్ అయ్యాయని.. ఇండియాలో ఒక్కరోజులో అత్యధిక ఇన్ స్టాల్స్ అయిన యాప్ ఇదేనని ఆ కంపెనీ ప్రకటించింది.

నిన్న ధోని బ్యాటింగ్ చేసే టైంలో అత్యధికంగా 1.6 కోట్ల మంది మ్యాచ్ వీక్షించారు. మ్యాచ్ వ్యూస్ 50 కోట్లు దాటినట్లు జియో పేర్కొంది.

వయాకామ్18 యొక్క జియోసినిమా యాప్ టోర్నమెంట్ యొక్క మొదటి రోజున 2.5 కోట్ల డౌన్లోడ్లను అందుకొని ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోజులో అత్యధికంగా ఇన్స్టాల్ చేయబడిన యాప్ రికార్డును బద్దలు కొట్టింది. టాటా IPL 2023 టోర్నమెంట్లో మొదటి రోజున ఈ రికార్డ్ సాధ్యమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.