ఏపీ నేతలకు కరోనా కష్టాలు.. జగన్ అభయం?!

Fri Sep 30 2022 09:16:53 GMT+0530 (India Standard Time)

Jagan to Help Leaders Effected in Corona Time

అదేంటి.. అనుకుంటున్నారా?  ఔను.. ఇది నిజమే! తాజాగా సీఎం జగన్.. పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల పనితీరు తెలుసుకున్నారు. గడపగడపకు కార్యక్రమంపై.. ఆయన మాట్లాడారు. నేతలను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పనిచేసేవారికే టికెట్ ఇస్తామని చెప్పారు. ఇదీ.. మీడియాలో వచ్చిన వైసీపీ సమావేశానికి సంబంధించిన వివరాలు. అయితే.. దీనికి ముందు.. వ్యక్తిగతంగా.. నాయకులను జగన్ కలుసుకున్నారట.ఈ సందర్భంగా.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కేవలం.. ఎమ్మెల్యేలను తాను ప్రశ్నించడం.. దశానిర్దేశం చేయడం మాత్రమేకాదు.. వారి నుంచి కూడా పార్టీకి సంబంధించిన అనేక విషయాలను తీసుకున్నారట జగన్. ఈ క్రమంలోనే కొందరు.. తమను కరోనా కష్టాలు వీడడం లేదని.. ఏదైనా దారి చూపించాలని కోరుకున్నారట. నిజానికి కరోనా సమయంలో ఏర్పడిన లాక్‌డౌన్ కారణంగా.. అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

అలాగే.. ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు కూడా వచ్చాయి. ఈక్రమంలో కొందరు నాయకులు.. ఎమ్మెల్యేలు.. తమ తమ వ్యాపారాలను కోల్పోయారు. అదేవిధంగా.. కొందరు అయితే.. అప్పులు కూడా చేశారు.

ఇప్పుడు ఆ సమస్యల నుంచి కోలుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమను ఆదుకోవాలని.. అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. పలువురుఎమ్మెల్యేలు.. జగన్‌ను అభ్యర్థించారు. అయితే.. వీటిని సానుకూలంగా విన్న జగన్.. త్వరలోనే ఎమ్మెల్యే నిధులు ఇస్తామని హామీ ఇచ్చారట.

ప్రస్తుతం రాష్ట్రంలోని సగంమందికి పైగా.. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ప్రజల్లోకి వెళ్లకపోవడానికి కారణం.. ఆర్థిక సమస్యలేనని స్పష్టంగా తెలుస్తోందని వైసీపీ కీలక నాయకులు కూడా చెబుతున్నారు.

ఇదే విష యంపై జగన్ ప్రత్యేకంగా దృష్టి.. ఆ సమస్యను పరిష్కరించేందుకు.. ప్రయత్నిస్తే.. తాము నేరుగా ప్రజలను కలుసుకునేందుకు ఇబ్బందులు లేవని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.