ప్రైవేటు ఆస్పత్రులపై జగన్ సర్కార్ కొరడా

Thu Jun 10 2021 06:00:02 GMT+0530 (IST)

Jagan govt lashes out at private hospitals

ఏపీలో కరోనా రోగుల నుంచి డబ్బు పిండుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై ఏపీ సర్కార్ కొరఢా ఝలిపించింది. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన జగన్ సర్కార్ భారీగా జరిమానాలు విధించింది. ప్రజలను పీడిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే కోవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంగించిన ప్రైవేటు ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 72 కేసుల్లో వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు జరిమానా విధించినట్లు ఏపీ సర్కార్ తెలిపింది. ఇటీవల చేసిన దాడుల్లో రూ.11.30 కోట్ల మేర ప్రైవేటు ఆస్పత్రుల నుంచి జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 94 ఫిర్యాదుల్లో 72 ఫిర్యాదులు ఆస్పత్రుల్లో అవకతవకలపై వచ్చాయని వివరించారు.

ఏపీలో ఆస్పత్రుల్లో  ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజు కంటే అధికంగా చార్జీలు వసూలు చేయటం.. అత్యవసర ఇంజెక్షన్ల విషయంలో అవకతవకలపై ఈ ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆస్పత్రుల వెలుపల కూడా మరో 22 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

గుంటూరు జిల్లాలోని ప్రైవే ఆస్పత్రుల నుంచి అత్యధికంగా రూ.4.53 కోట్ల మేర జరిమానా వసూలు చేసినట్లు స్పస్టం చేసింది.