Begin typing your search above and press return to search.

గవర్నర్ vs కేసీఆర్ : వైరానికి కామానే... ఫుల్ స్టాప్ కాదు..

By:  Tupaki Desk   |   31 Jan 2023 10:40 AM GMT
గవర్నర్ vs కేసీఆర్ : వైరానికి కామానే... ఫుల్ స్టాప్ కాదు..
X
దాదాపు ఆరునెలలుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇవి తారా స్థాయికి చేరాయి. గవర్నర్ తో అవసరం లేకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించవచ్చని కేసీఆర్ భావించారు. ఇందులో భాగంగా రిపబ్లికే డే వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాల్సి ఉండగా.. రాజ్ భవన్ కే పరిమితం చేశారు. గత అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండా కొనసాగించారు. దీంతో కొంత మంది బీఆర్ఎస్ నాయకులు కూడా గవర్నర్ పదవి కంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులే గొప్ప అంటూ రాజ్ భవన్ పై విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు గవర్నర్ పదవి అంటే రబ్బర్ స్టాంప్ కాదు. ఆ పదవికీ ప్రాముఖ్యత ఉంది అని తాజాగా నిరూపితమైంది. ప్రభుత్వం ఎంత పెద్ద చట్టం చేసినా గవర్నర్ సంతకం లేకుండా ఆది ఆమోదయోగ్యం కాదు. గవర్నర్ పాస్ చేయకుండా ఏ బిల్లు చెల్లదు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ తమిళ సై పెట్టిన కండిషన్లకు తలొగ్గింది. గవర్నర్ వర్సెస్ కేసీఆర్ సర్కార్ వివాదానికి ప్రస్తుతానికి కామానే పెట్టారు. ఫుల్ స్టాప్ అయితే పడలేదు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ను ఈనెల 3న ప్రవేశపెట్టాలని ముందుగా నిర్ణయించారు. ఈమేరకు గవర్నర్ కు జనవరి 21న ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గవర్నర్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తేదీ దగ్గరపడుతుండడంతో ప్రభుత్వం బడ్జెట్ కు ఆమోదం తెలపాలని హైకోర్టుకు వెళ్లింది. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఏ పద్ధతిని గవర్నర్ విషయంలో జోక్యం చేసుకోవాలో తెలపాలన్నారు. గవర్నర్ విషయంలో హైకోర్టుకు పరిమితులు ఉంటాయన్నారు. అయితే ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ రాజ్యంగ ఉల్లంఘన జరిగినప్పుడు రాజ్యంగంలోని ఆర్టికల్ 174, 153 ప్రకారం గవర్నర్ విధులను ప్రశ్నించే అధికారం ఉందని పేర్కొన్నారు.

అయితే గవర్నర్ తరుపున న్యాయవాది అశోక్ ఆనంద్ వాదిస్తూ గతేడాది బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదని, బడ్జెట్ ఫైల్ పంపాలని కోరినా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై దుష్యంత్ దవే స్పందించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అర్థమయ్యేలా చూస్తానని చెప్పారు.

గవర్నర్ తో అసవరం లేకుండానే ప్రభుత్వం సాగుతుందన్న కేసీఆర్ ఇప్పుడు తమిళ సై పెట్టిన కొన్ని కండిషన్లకు తలొగ్గినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అసెంబ్లీలో అమలు చేసే ప్రతి బిల్లుపై గవర్నర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అవి యాక్టుగా మారుతాయి. లేకపోతే చెల్లవు. అయితే అసెంబ్లీ పంపిన బిల్లులు ఎన్నిరోజుల్లో అమలు చేయాలనేది రాజ్యాంగంలో లేదు. గతేడాది సెప్టెంబర్లో అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులను పరిశీలించిన తరువాతే సంతకం చేస్తానని, వాటిని గవర్నర్ పెండింగులో పెట్టారు. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించే వ్యక్తుల పూర్వపరాలు తెలుసుకొని ఆమోదం తెలపాలని కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ అలాగే ప్రవర్తించారు. అయితే అప్పటి నుంచి గవర్నర్ పై ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. కానీ ఇప్పుడు వాటి ఆమోదం కోసం గవర్నర్ కండిషన్లకు ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఈసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ న్యాయనిపుణులు మాత్రం గవర్నర్ లేకుండా సమావేశాలు నిర్వహిస్తే సమస్యలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాజ్యంగం ప్రకారం ఉభయ సభలను సమన్వయ పరిచే అధికారం గవర్నర్ కే ఉంటుంది. ప్రభుత్వం సూచించే తేదీల్లో గవర్నర్ సెషన్ నిర్వహణ కోసం గెజిట్ ను విడుదల చేస్తారు. ఇక ప్రోరోగ్ చేసే అధికారం కూడా గవర్నర కే ఉంటుంది.

ఒకవేళ ప్రోరోగ్ లేకుండా సభలను నిర్వహిస్తే అత్యవసర బిల్లులపై ఆర్డినెన్స్ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. అయితే ప్రభుత్వం చాలా విషయాల్లో అర్డినెన్స్ తీసుకోచ్చే అవసరం ఏర్పడింది. కానీ తమిళ సై తో ఏర్పడిన వివాదాల కారణంగా ఇవి పెండింగులో పడ్డాయి. ఇప్పుడు న్యామూర్తుల సమక్షంలో ప్రభుత్వం తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవడంతో వివాదం సమసిపోయిందనే తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.