మాది తోడికోడళ్ల పంచాయితీ.. రేవంత్ తో జగ్గారెడ్డి సరదా

Fri Dec 02 2022 22:13:25 GMT+0530 (India Standard Time)

Issues Between Revanth Reddy And Jagga Reddy Resolved Finally

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకించిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయన కలపడగానే చల్లబడ్డాడు. రేవంత్ రెడ్డితో సరదా సంభాషణ జరిపారు. రేవంత్ జగ్గారెడ్డి సరదాగా మనసు విప్పి మాట్లాడుకున్నారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాగానే మొదట ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశాడు జగ్గారెడ్డి.. రేవంత్ పైన ఫిర్యాదు చేయడానికి.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు వివరించడానికి కాంగ్రెస్ అసమ్మతి నేతలతో కలిసి ఢిల్లీకి చేరారు. వారికి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అగ్ర నేత రాహుల్ గాంధీ యే కాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ లను కలిసి వ్యతిరేకించారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించడానికి ఓ వైపు రేవంత్ రెడ్డి  వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంటే మరోవైపు జగ్గారెడ్డి మాత్రం సొంత పార్టీలోనే మరో వర్గంగా అసమ్మతి రాజేశారు.

అలా ఉప్పు నిప్పుగా ఉన్న రేవంత్ జగ్గారెడ్డిలు ఈరోజు కలిశారు. నేడు అసెంబ్లీ ఆవరణలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ మధ్య జరిగేది పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. తమది ‘తోడికోడళ్ల పంచాయితీ’ అని చమత్కరించారు.  ఒక ఇంట్లో ఉండే తోడికోడళ్లు ఎన్నో అనుకుంటారు. ఆ తర్వాత కలిసిపోయారు. తాము కూడా అంతేనని రేవంత్ రెడ్డి అన్నారు.

అయితే మీడియా జర్నలిస్టులు ఇందులో ‘పెద్దకోడలు’ ఎవరు అంటూ ప్రశ్నించగా.. ఇప్పుడే కలిశాం.. అప్పుడే పుల్లలు పెడుతారా? అంటూ మీడియాలోపై రేవంత్ సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి స్పందిస్తూ.. ‘తాను రేవంత్  కు ఛాన్స్ ఇవ్వాలని.. అసెంబ్లీ ఎన్నికల వరకూ రేవంత్ గురించి మాట్లాడబోనని చెప్పారు. రేవంత్ రెడ్డి అధిష్టానం మద్దతుతో పాదయాత్రకు చేపడితే మద్దతు ఇష్తానని స్పష్టం చేశారు.

ఇలా ఎప్పుడూ రుసరుసలాడుకునే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిలు అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి సరదాగా నవ్వుతూ సెటైర్లు వేసుకోవడం అందరినీ అలరించింది. మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.