Begin typing your search above and press return to search.

టాప్ న్యూస్ చానెల్స్ అన్నీ ఇక మూసుకోవడమేనా?

By:  Tupaki Desk   |   25 Sep 2020 8:50 AM GMT
టాప్ న్యూస్ చానెల్స్ అన్నీ ఇక మూసుకోవడమేనా?
X
తెలుగు మీడియాలో ఏదో జరుగుతోంది. తెరవెనుక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అదేంటి చెప్మా? అని ఇప్పుడు జర్నలిస్టులు శూలశోధన చేస్తున్నారట.. అవును.. తెలుగు న్యూస్ చానెల్స్ ఒక స్పష్టమైన మార్పు ఇప్పుడు కనిపిస్తోందట..

ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్స్ లో న్యూస్ రీడర్స్, డిబేట్స్ రన్ చేసే దిగ్గజ జర్నలిస్టులంతా మాయమైపోతున్నారట.. ఒక్కొక్క చానెల్ లో ఒక్కక్కరు వైదొలుగుతున్నారట. చాలా మంది ఇప్పటికే మానేయడంతో కొన్ని చర్చలు చాలా చప్పగా నడుస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మరికొంతమంది మానేయడానికి రెడీగా ఉన్నారంట.. అల్ రెడీ పేరుపొందిన పెద్ద చానెల్స్ లో ఇప్పటికే కొంతమంది మానేశారట. దీనివెనుక ఏం జరుగుతుందనేది అంతుచిక్కడం లేదు. దీనివెనుక అసలు కథ ఏంటని కొందరు జర్నలిస్టులు ఆరాతీస్తే అసలు కథ వెలుగుచూసిందన్న గుసగుసలు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

తెలుగు న్యూస్ చానెల్స్ కే ఒక ఒరవడిని నేర్పిన ఘనత ఖచ్చితంగా సీనియర్ జర్నలిస్టు రవిప్రకాశ్ దే.. ఆయన సారథ్యంలో ఇప్పుడు కొత్త న్యూస్ చానెల్స్ రాబోతోందట..అందులోకి ఈ దిగ్గజ జర్నలిస్టులు.. న్యూస్ రీడర్స్ జంప్ అవ్వబోతున్నారంట.. ఇప్పటికే రవిప్రకాష్ ఒక న్యూస్ చానెల్ ను స్ట్రాట్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేసి నంబర్ 1 పొజిషన్ కు చేర్చిన అనుభవం ఉంది. అందుకే ఇప్పుడు ఆయన తెలుగులో మరో కొత్త చానెల్ కు పురుడు పోస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ జర్నలిస్టులంతా ఒక చానెల్ లోకి వెళితే ఇంకా ఆ చానెల్ కు తెలుగులో తిరుగుండదనే టాక్ నడుస్తోంది. జాతీయ స్థాయిలో ‘రిపబ్లిక్’ న్యూస్ చానెల్ ఎలా అయితే దుమ్ము రేపుతుందో అలానే రవిప్రకాష్ చానెల్ పెట్టబోతున్నాడని.. మరి అది క్లిక్ అవుతుందా కాదా అన్నది చూడాలి. ఈ చానెల్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల కోణం.. అందరినీ ఉతికి ఆరేసేలా తీర్చిదిద్దబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే ఫేమస్ జర్నలిస్టులు అందరినీ తన వద్దకు పిలిపించుకొని మళ్లీ కొత్త చానెల్ కు పురుడు పోస్తున్నట్టు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇక ఇదే కనుక జరిగితే తెలుగులోని టాప్ న్యూస్ చానెల్స్ అన్ని ఇక మూసుకోవడమేనా అన్న చర్చ జరుగుతోంది. టాప్ జర్నలిస్టులు అంతా రవిప్రకాష్ చానెల్ కు మారితే ఇక తెలుగు న్యూస్ చానెల్స్ లో బీభత్సం సృష్టించడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మరి రవిప్రకాష్ న్యూస్ చానెల్ పెడుతున్నాడా? వీరంతా జాయిన్ అవుతున్నారా? అది వస్తుందా అన్నది వేచిచూడాలి.