రాహుల్ పిలక వెనక సీక్రెట్ అదేనా?

Wed Apr 21 2021 11:00:01 GMT+0530 (IST)

Is there a secret behind Rahul

రాహుల్ చాహర్ ముంబై ఇండియన్స్ జట్టుకు కీలక ఆటగాడు. కీలక టైంలో వికెట్లు తీస్తూ జట్టును ఆదుకుంటూ ఉంటాడు. అతడి స్పిన్ మాయాజాలానికి చేయి తిరిగిన బ్యాట్స్‌మెన్ సైతం భయపడుతూ ఉంటారు. ముంబై ఇండియన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ రాహుల్ చాహర్‌కే బంతిని ఇచ్చేస్తాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనూ చాహర్ దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా మూడు మ్యాచ్ లు ఆడగా.. రాహుల్ ఏడు వికెట్లను పడగొట్టాడు. అతడు పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు.రాహుల్ చాహర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 4/27.

 రాహుల్ ఆహార్యం కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది. డిఫరెంట్ హెయిర్ స్టయిల్ వెనక చిన్న పిలకతో కనిపిస్తుంటాడు రాహుల్. మామూలుగా వెస్టిండీస్ ఆటగాళ్లు ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు ఇలా డిఫరెంట్ హెయిర్‌స్టయిల్ లో కనిపిస్తారు. క్రిస్ గేల్ గతంలో మలింగ విభిన్నమైన హెయిర్‌స్టైయిల్ తో ఉండేవాళ్లు. ధోనీ కూడా ప్రారంభంలో పెద్ద జుట్టుతో అలరించేవాడు. అయితే ప్రస్తుతం స్వదేశీ క్రికెటర్లలో రాహుల్ చాహర్‌ది డిఫరెంట్ హెయిర్ స్టయిల్.

రింగుల జుట్టును బలంగా వెనక్కి దువ్వినట్టు ఉంటుంది. చివర్లో చిన్నపిలకను ముడేసి ఉంటుంది.

అయితే రాహుల్ హెయిర్ స్టయిల్ వెనక ఏదైనా సిక్రెట్ ఉందా? కేవలం డిఫరెంట్‌గా కనిపించడానికే అతడు అటువంటి హెయిర్ స్టయిల్ తో కనిపిస్తున్నాడా? అనేది అందరి మదిలో నెలకొన్న ప్రశ్న. ఇదిలా తాజాగా ఓ విషయం బయటపడింది. రాహుల్ హెయిర్ స్టయిల్ డిఫరెంట్ గా ఉండటానికి కారణం అతడి గర్ల్ ఫ్రెండ్ అట. రాహుల్ చాహర్‌కు 2019లో నిశ్చితార్థమైంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఇషానీని అతడు  పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఇషాను రాహుల్ ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నాడు.

చాలా కాలం పాటు ఇషా రాహుల్ చట్టాపట్టలు వేసుకొని తిరిగారు. ఆ టైం నుంచి  రాహుల్ ఈ తరహా హెయిర్ స్టయిల్ తో కనిపిస్తున్నాడు.

రాహుల్ హెయిర్ స్టయిల్ కు కారణం అతడి ప్రియురాలే.

తాజాగా  ఇషానీతో కలిసి దిగిన ఓ ఫొటోను రాహుల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.