Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆర్ధిక మాంద్యమా ?

By:  Tupaki Desk   |   17 May 2022 5:29 AM GMT
అమెరికాలో ఆర్ధిక మాంద్యమా ?
X
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం భయంకరంగా పెరిగిపోయిందంటే అర్థముంది. దీని కారణంగానే రాజకీయ సంక్షోభం పెరిగిపోయి ఏకంగా ప్రధానమంత్రి మహీంద రాజపక్సే పదవికే ఎసరొచ్చింది. సరే ఈ ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయిందంటే అందుకు అనేక కారణాలున్నాయి.

మరి అమెరికాలో కూడా ఆర్ధికమాంద్యం పెరిగిపోతోందంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది. అమెరికా ప్రజలు, కంపెనీలు తొందరలోనే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని గోల్డ్ మ్యాన్ శాక్స్ సీనియర్ ఛైర్మన్ లాయిడ్ బ్లాంక్ పెయిన్ హెచ్చరించారు.

తాజాగా లాయిడ్ చేసిన హెచ్చరిక అమెరికాలో కలకలంగా సృష్టిస్తోంది. ఆర్ధికంగా అమెరికా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉందని లాయిడ్ ప్రకటించారు. తనకేదైనా కంపెనీ ఉన్నా, లేదా మామూలు వినియోగదారుడినే అయినా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవటానికి సర్వసిద్ధంగా ఉండేవాడినని చేసిన ప్రకటన అమెరికాలో బాగా వైరల్ గా మారింది. అయితే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి ఫెడరల్ రిజర్వ్ దగ్గర అనేక శక్తిమంతమైన మార్గాలున్నట్లు కూడా చెప్పారు.

పెరిగిపోతున్న ఇంధన ధరలు, బేబీ ఫార్ములా వంటివి అమెరికన్లు పడుతున్న ఇబ్బందులకు ఉదాహరణలుగా లాయిడ్ తెలిపారు. వినియోగదారుల సెంటిమెంటు బాగా దెబ్బతినటంతో పరిస్థితి 2011 నాటి స్ధాయికి చేరుకుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. వినిమయవస్తువులు దేశంలో గతంతో పోలిస్తే 8.3 శాతం పెరగటంపై ఆందోళన వ్యక్తంచేశారు.

నిజానికి అమెరికా ప్రభుత్వం కూడా ట్రిలియన్ల డాలర్ల అప్పుల్లో ఉంది. కాకపోతే ఇతర దేశాలకు ఆయుధాలను అమ్మటం ద్వారా, విదేశాల్లో సహజవనరులను కొల్లగొట్టడం ద్వారా తన అప్పులను కాస్త సర్దుబాటు చేసుకుంటోంది. మొదటి నుండి కూడా అమెరికా వ్యూహాత్మకంగా వెనుకబడిన దేశాలకు అప్పులిచ్చే సాకుతో ఆయా దేవాల్లో పాగావేసి ఆయా దేశాల్లోని సహజవనరులను దోచేసుకుంటోంది.

ఆఫ్రికాలోని చాలాదేశాల్లో అమెరికా ఇదే పనిచేసింది. ఆఫ్ఘనిస్ధాన్లో కూడా ఇదేచేద్దామని అనుకున్నది కానీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. ఏఏ దేశాల్లో సహజవనరులు ఉన్నాయనే విషయాన్ని శాటిలైట్ల ద్వారా పసిగట్టడం, వెంటనే ఆ దేశాల్లో పాగావేయటమే అమెరికా పనిగా పెట్టుకున్నది. ఇలాంటి అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం రాబోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.