Begin typing your search above and press return to search.

ప‌శ్చిమాసియా దేశాల్లో వ‌యాగ్రాకు అంత‌ డిమాండ్ అందుకేనా?

By:  Tupaki Desk   |   2 July 2022 12:30 AM GMT
ప‌శ్చిమాసియా దేశాల్లో వ‌యాగ్రాకు అంత‌ డిమాండ్ అందుకేనా?
X
ప్ర‌తి మ‌గాడు త‌న శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాల‌నుకుంటాడు అంటే అతిశ‌యోక్తి కాదు. ఏదైనా ఆహారం, డ్రింక్, ఆయుర్వేద మూలిక‌లు, ఇత‌ర మెడిసిన్స్ ఏవైనా శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయ‌ని తెలిస్తే వాటి కోసం ఎగ‌బ‌డుతుంటారు. అలాగే గ‌ల్ఫ్ కంట్రీస్ (అర‌బ్ దేశాలు)లోనూ వీటి వాడ‌కం చాలా ప్రాచీన‌కాలం నుంచే ఉంద‌ని తెలుస్తోంది.

సాధార‌ణంగా యువ‌కుల‌తో పోలిస్తే న‌డి వ‌య‌సువారు, శృంగార కోరిక‌లు చావ‌ని వృద్ధులు సంప్ర‌దాయ మూలిక‌లు, ఔష‌ధాల‌వైపు మొగ్గుచూపుతారు. అలాగే అర‌బ్ దేశాల్లోనూ వ‌య‌సు ఎక్కువ‌గా ఉన్న పురుషులు వీటిని ఎక్కువ‌గానే వినియోగిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో సంప్ర‌దాయ మూలిక‌లు, ఔష‌ధాల కంటే కూడా పశ్చిమ దేశాలు తయారు చేసే వయాగ్రా వంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంచే బ్లూ పిల్స్‌ను అరబ్ దేశ‌స్తులు ఎక్కువగా వాడుతున్నాని అంటున్నారు. ఈ బ్లూ పిల్సుకు సెక్స్ సామ‌ర్థ్యాన్ని పెంచే గుణం ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని పేర్కొంటున్నారు.

గ‌ల్ఫ్ దేశాల్లో యువకులు సిల్డెనాఫిల్ (వయాగ్రా), వర్డెనాఫిల్ (లెవిట్రా), టడలాఫిల్ (సియాలిస్) వంటి బ్లూ పిల్స్‌ను గ‌ణ‌నీయంగా వాడుతున్నార‌ని వివిధ అధ్య‌య‌నాలు కూడా పేర్కొండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. ఈజిప్టు, యెమెన్ దేశాల్లో బ్లూపిల్స్ ను ఎక్కువ‌గా వాడుతున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌ధానంగా 20 నుంచి 45 ఏళ్ల వయసు పురుషులు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నార‌ని వివిధ గ‌ణాంకాలు చెబుతున్నాయి.

అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ అక్కడి యువత శృంగార సామర్థ్యాన్ని పెంచే మెడిసిన్‌ను ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. శృంగారంలో అమ్మాయిల మీద కంటే అబ్బాయిల‌పైనే ఒత్తిడి ఎక్కువ ఉంటుంద‌ని.. బాగా చేయ‌క‌పోతే భాగ‌స్వామి చేతిలో త‌మ ప‌రువు పోతుంద‌ని యువ‌కులు భ‌య‌ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. దీంతో వారు వ‌యాగ్రా, శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఇత‌ర మెడిసిన్స్ వైపు ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని పేర్కొంటున్నారు.

మ‌రోవైపు అర‌బ్ దేశాల్లో పురుషుల‌కంటే మ‌హిళ‌ల‌కే శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు. అందువ‌ల్ల వారిని సంతృప్తిప‌ర‌చాలంటే త‌మ సెక్స్ సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాల‌ని పురుషులు భావిస్తున్నార‌ని పేర్కొంటున్నారు.

వాస్త‌వానికి ఒట్టోమన్ సామ్రాజ్య కాలంలోనే అప్ప‌టివారు శృంగార కోరిక‌ల‌ను పెంచే మూలికలు వాడారు అనడానికి ఆధారాలున్నాయ‌ని చెబుతున్నారు. అటు పురుషులు, ఇటు మ‌హిళ‌లు కూడా వీటిని వాడేవార‌ని తెలుస్తోంది. ఈ శృంగార సామ‌ర్థ్యాల‌ను పెంచే మూలిక‌ల గురించి ఒక పుస్తకం రాయాలని ఓట్టోమాన్ సుల్తాన్ స‌లీం-1 త‌న ఆస్థానంలోని ర‌చ‌యిత‌లను కోరార‌ని కూడా తెలుస్తోంది. దీంతో అహ్మ‌ద్ బిన్ సులేమానీ అనే ర‌చ‌య‌త 'షేక్స్ రిటర్న్ టు యూత్' అనే పుస్తకాన్ని రాశార‌ని చెబుతున్నారు. ఇందులో శృంగార కోరిక‌ల‌ను పెంచే దినుసులతో పాటు సెక్స్ వల్ల సంక్రమించే వ్యాధుల నివారణకు మూలికలను కూడా పుస్తకంలో ప్రస్తావించార‌ని చెబుతున్నారు. కాగా సెక్స్ సామర్థ్యం పెంచుకునే పిల్స్ వాడే దేశాల్లో సౌదీ అరేబియా తొలి స్థానంలో ఉండగా ఈజిప్టు రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.