విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి అందుకే తప్పుకున్నాడట?

Mon Jan 17 2022 21:06:57 GMT+0530 (India Standard Time)

Is that why Virat Kohli resigned from the captaincy

టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ సడెన్ గా గుడ్ బై చెప్పడంపై క్రీడా అభిమానులు విశ్లేషకులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎవరికి తోచినట్టు వారు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడంపై టీమిండియా మాజీక్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  తన కెప్టెన్సీకి ముప్పు ఉందని భావించే తనను తొలగించే అవకాశం వేరే వాళ్లకు ఇవ్వకుండా కోహ్లీ తనకు తాను తప్పుకున్నాడని చెప్పుకొచ్చాడు.టీమిండియాలో తన కెప్టెన్సీకి ముప్పు ఉందని భావించే విరాట్ కోహ్లీ తనకు తానుగా తప్పుకున్నాడని.. ఏదో ఒక కారణంతో తనను తొలగించే అవకాశం ఇతరులకు ఇవ్వొద్దని భావించి ఉంటాడని తెలిపారు.ఈ మధ్య కాలంలో కోహ్లీ విషయంలో చాలా తక్కువ కాలంలోనే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చూస్తుండగానే వైట్ బాల్ కెప్టెన్సీకి దూరమయ్యాడు. ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇవన్నీ తక్కువ కాలంలోనే జరగడం ఆసక్తికరంగా మారింది’ అని మంజ్రేకర్ అన్నాడు.

ఇటీవల బీసీసీఐలో టీం మేనేజ్ మెంట్ లో కీలక మార్పులు జరిగాయి. కోచ్ రవిశాస్త్రి దిగిపోయి.. హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆధిపత్యానికి చెక్ పడింది. కోహ్లీ ఆటలు సాగడం లేదన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే అనిల్ కుంబ్లేతో గొడవకు దిగి అతడిని పంపించేసిన బీసీసీఐ ఇప్పుడు గంగూలీకి దగ్గరైన ద్రావిడ్ ను బయటకు పంపే అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే కోహ్లీనే కెప్టెన్సీ నుంచి వైదొలిగారు.తనను తీసివేయకుమందే ముందే తేరుకొని కెప్టెన్సీ వదిలేశాడని తెలుస్తోంది.

ఈ నిర్ణయంపై కోహ్లీ కంఫర్ట్ జోన్ లో లేడని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాటర్ గా కూడా గతంలో మాదిరిగా రాణించలేకపోతున్నాడని అన్నాడు. విరాట్ కోహ్లీ నిర్ణయాలన్నీ కూడా భావోద్వేగంతో కూడుకున్నవని తెలిపాడు.