టీడీపీ క్లీన్ స్వీప్ చేసే ఫస్ట్ జిల్లా అదేనా?!

Fri Sep 30 2022 18:55:28 GMT+0530 (India Standard Time)

Is that the first district where TDP will make a clean sweep

ఔను.. ప్రకాశం జిల్లాపై వైసీపీ పట్టుకోల్పోతోందనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 4 త ప్ప మినహా సీట్లను కైవసం చేసుకుంది. ఉమ్మడి ప్రకాశం  జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 8 చోట్ల వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. అధికారపార్టీ నేతల దూకుడు ఎలా ఉందోతెలియదు కానీ.. టీడీపీ గెలిచిన నాలుగు స్థానాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు దూకుడుగా ఉన్నారు. మొత్తం నలుగురులో ఒకరు  కరణం బలరాం.ఈయన గత ఎన్నికలు ముగిసిన తర్వాత.. వైసీపీ పంచన చేరిపోయారు. మిగిలిన ముగ్గురు.. గొట్టిపాటి రవికుమార్ ఏలూరి సాంబశివరావు డీబీవీ స్వామి.. మంచి దూకుడుగా ఉన్నారు. వీరి దూకుడు ముందు .. వైసీపీ నాయకులు ఎక్కడా తూగడం లేదనే వాదన ఉంది. పోనీ.. అధికారపార్టీలో ఉన్న వారు ప్రజల మధ్య ఉంటున్నారా? అంటే.. అది కూడా లేదు. ఒంగోలు సంతనూతలపాడు కనిగిరి మార్కాపురం ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకత పెరిగిందని అంటున్నారు.

అంటే.. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ దూకుడు పెంచిందనే చెప్పాలి. ఈ ఏడాది నిర్వహించిన మహానాడుకు.. భారీ స్పందన వచ్చింది. నిజానికి మహానాడును ఒంగోలులోనిర్వహిస్తే.. ఇబ్బంది వస్తుం దని అనుకున్నారు. కానీ కనివిని ఎరుగని రీతిలో విజయం సాధించింది. ఈ ఫలితం తర్వాత.. టీడీపీ నేతలు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారని.. పార్టీ అధిష్టానం కూడా అంచనా వేస్తోంది. ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న నియోజకవర్గాలకు తోడు.. ఇవి కలుస్తాయని అనుకుంటున్నారు.

ఇక అంతో ఇంతో వెనుక బడ్డ నియోజక వర్గాలపైనా.. దృష్టి పెట్టాలని.. చూస్తున్నారు. ఇదే జరిగితే.. ప్రకా శం క్లీన్ స్వీప్ చేయడం.. పెద్ద పనికాదని.. అంటున్నారు టీడీపీ సీనియర్లు.. ప్రస్తుతం దామచర్ల సత్య దామచర్ల జనార్దన్ వంటివారే చక్రం తిప్పుతున్నారు.

చంద్రబాబుకు ఈ ఫ్యామిలీపై ఉన్న నమ్మకం.. అందరినీ కలుపుకొని పోతున్న వైనం వంటివి..ప్రకాశంలో టీడీపీ ఘన విజయం దక్కించుకుంటుందని అంటున్నారు. మరి టీడీపీ నేతల అంచనాలు.. ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.