కేంద్రం అనుమతిస్తేనే షూటింగ్ లకు అనుమతి?

Fri May 29 2020 09:45:44 GMT+0530 (IST)

Is shootings allowed only by the Center?

అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది కేంద్ర ప్రభుత్వం తీరు.. తెలంగాణ ప్రభుత్వంతో వారం రోజుల నుంచి సినిమా షూటింగ్ ల అనుమతి కోసం  నరుక్కొస్తున్న సినీ పెద్దలకు మరో షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చే హక్కు కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉందని.. రాష్ట్రాలకు ఆ హక్కు లేదనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా పాపం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న సినీ పెద్దలకు షాకింగ్ లా మారింది. కేసీఆర్ తలుచుకుంటే షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం పెద్ద పని కాకున్నా.. కేంద్రం లాక్ డౌన్ 5.0లో ఏదైనా కొర్రీ పెడితే మళ్లీ షూటింగ్ ల అనుమతి పరిస్థితి తలకిందులవుతుందనే ఆందోళన సినీ వర్గాల్లో ఆందోళనకు గురి చేస్తోంది.
 
కేంద్ర ప్రభుత్వం గనుక పర్మిషన్ ఇవ్వకపోతే సినిమాలు షూటింగ్ లు మొదలు కావడం కష్టమేనని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అక్కడ నుంచి నరుక్కు రావాలి అని సినీ పెద్దలు అంటున్నారట.! అన్ని భాషలు వారు ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే కానీ రాబోతున్న లాక్ డౌన్ 5 లో థియేటర్స్ ఓపెన్ చేయరని.. షూటింగ్ లకు అనుమతి ఇవ్వరనే చర్చ నడుస్తోంది.రాష్ట్రాలు పలు విధానమైన పరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ తెలంగాణలో మొదలై దేశవ్యాప్తంగా బంద్ ఉంటే సినీ పరిశ్రమకు కష్టమే.. ముఖ్యంగా సినిమాల విడుదల ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని భాషల్లో చేస్తున్నారు. అలా అయితే నిర్మాతలకు గిట్టుబాటు అవుతుంది. ముఖ్యంగా సగం జనాభా హిందీ బెల్ట్ లోనే ఉంది. అన్ని బాషల వారు అన్ని నగరాల్లో ఉన్నారు. కాబట్టి అక్కడ థియేటర్స్ ఓపెన్ అయితేనే సినిమా పరిశ్రమకు ఊరట..

ఇక షూటింగ్ లు కూడా తెలంగాణలో ఓపెన్ అయితే ఏం లాభం లేదు. కేరళ కశ్మీర్ సహా ఉత్తర భారతంలోని ప్రముఖ షూటింగ్ స్పాట్స్ లు కూడా ఓపెన్ అవ్వాలి. అప్పుడే సినిమాల నిర్మాణానికి వీలవుతుంది. అంతేకానీ తెలంగాణలో షూటింగ్ లకు అనుమతిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదన్నది సినీ పెద్దల వాదన.