బిల్ గేట్స్ విడాకులకు ఆమె కారణమా..?

Thu May 06 2021 08:00:01 GMT+0530 (IST)

Is she the reason for Bill Gates divorce

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆయన భార్య మెలిందా గేట్స్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన ప్రపంచం నివ్వెరపోయింది. 65 సంవత్సరాల వయసున్న బిల్ గేట్స్ 56 ఏళ్ల వయసున్న మెలిందా ఈ వయసులో విడిపోవడం ఏంటనేది ఎవ్వరికీ అర్థం కాలేదు.అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనే బిల్ గేట్స్ గురించిన షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేమంటే.. మెలిందాను పెళ్లి చేసుకోవడానికి ముందు బిల్ గేట్స్ కు అన్ విన్ బ్లాడ్ అనే గర్ల్ ఫ్రెండ్ ఉందట. వీళ్లిద్దరూ డేటింగ్ చేసి ఫుల్లుగా ఎంజాయ్ చేసేవారట.

ఆ తర్వాతనే మెలిందా పరిచయం అయ్యిందట. మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగిగా ఉన్న మెలిందాను 1994లో పెళ్లి చేసుకున్నారు గేట్స్. అయితే.. తన ప్రేమ సంగతి భార్య మెలిందాకు చెప్పిన బిల్ గేట్స్.. ఆమెతో ఎవ్వరూ ఊహించని ఒప్పందం ఒకటి చేసుకున్నాడట!

ఆ ఒప్పందం ప్రకారం.. సంవత్సరానికి ఒకసారి తన మాజీ ప్రేయసిని బిల్ గేట్స్ అధికారికంగా కలుసుకోవచ్చట! ఈ ఒప్పందం 1997 వరకు కొనసాగిందట. ప్రతిఏటా ఆమెను కలుసుకోవడానికి వెళ్లే గేట్స్.. ఓ వారం పాటు జాలీగా ఎంజాయ్ చేసి వచ్చేవాడట. నార్త్ కరోలినాలోని విన్ బ్లాడ్ కు చెందిన బీచ్ కాటేజ్ వద్ద ఇద్దరూ కలుసుకునేవారట. 97 తర్వాత ఈ ఒప్పందం కొనసాగిందా? లేదా? అన్నది మాత్రం తెలిదట!

ప్రపంచానికి తెలియని ఈ సీక్రెట్ ను ప్రముఖ అమెరికన్ జర్నలిస్టు వాల్టర్ ఐజాక్సన్ తాజాగా వెల్లడించినట్టు సమాచారం. ఇప్పుడు ఈ సమాచారం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. బిల్ గేట్స్ విడాకులకు ఆమే కారణమా? అని సందేహిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారా? అందువల్లనే విడాకులు తీసుకున్నారా? అని చర్చించుకుంటున్నారు.