Begin typing your search above and press return to search.

వృద్ధాప్యాన్ని జయించి వయసును వెనక్కి మళ్లించొచ్చా.. సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   17 May 2022 11:30 AM GMT
వృద్ధాప్యాన్ని జయించి వయసును వెనక్కి మళ్లించొచ్చా.. సాధ్యమేనా?
X
కాలంతో పాటు వయసు మీద పడటం సహజమే. అయితే వృద్ధాప్యం అందరికీ ఒకేలా రాదు. కొందరిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవ వచ్చు. కొందరికి వయసు నెమ్మదిగా మీద పడవచ్చు. ఎవరినైనా తొలిసారి చూసినప్పుడు అసలు వయసు కన్నా కొందరు చిన్నగానూ, కొందరు బాగా వయసు మీద పడినట్టుగానూ కనిపించడం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం కాలాన్ని బట్టి... అంటే పుట్టిన రోజుతో లెక్కించే వయసు, శారీరకంగా సంభవించే సంభవించే వృద్ధాప్యం భిన్నంగా ఉండటమే.

వృద్ధాప్య ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. అయితే దీన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఒకే వయసు వారు అయినప్పటికీ ఏ ఇద్దరిలోనూ శారీరక వయసు సమానంగా ఉండదు. ఆయుష్షు దగ్గర నుంచి ఆరోగ్యంగా, హాయిగా జీవించడం వరకు అన్నీ వేరుగానే ఉంటాయి. వయసు మీద పడటాన్ని ప్రధానంగా జన్యువులే నిర్ణయించినా అంతా వీటి మీదే ఆధారపడి లేదు. మన ఆయుష్షు లో 10 నుంచి 30 శాతం వరకే జన్యువులు ప్రభావం చూపుతాయి. మిగతాదంతా మన రోజువారీ వ్యవహారాల మీదే ఆధారపడి ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ఆహారం, వ్యాయామం, మానసిక ఒత్తిడి, పొగ, మద్యం అలవాట్ల వంటి పాత్రే ఎక్కువ. దురదృష్ట వశాత్తు మనలో చాలా మంది దీన్ని అంగీకరించరు. అలవాట్లను ఉన్నపళంగా మార్చుకోవడానికి మనసు ఒప్పుకోదు కదా.

కాలంతో ముడిపడిన వయసు ఒకే దిశ లో సాగుతుంది. ఇది తగ్గటమంటూ ఉండదు. అదే శారీరక వయసు వేగంగా పెరగొచ్చు. నెమ్మదిగా సాగవచ్చు. కావాలంటే దీన్ని వెనక్కి మళ్లించుకునే అవకాశమూ ఉందని వైద్య శాస్త్రం చెబుతోంది. అంటే దీనర్థం 150 ఏళ్ల వరకు జీవించొచ్చని కాదు... బతికినంత కాలం హాయిగా, ఆరోగ్యంగా గడిపేలా చూసుకోవచ్చని.

వృద్ధాప్య ప్రక్రియలో టెలోమేర్స్, డీఎన్ఏకు అంటుకునే రసాయనాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఒక రకంగా క్రోమోజోమ్ తోలకని అనుకోవచ్చు. వీటి పొడవును బట్టి శారీరక వయసును నిర్ధారించవచ్చు. శారీరక వయసు పెరిగే కొద్దీ చెలోమేర్స్ పొడవు తగ్గుతూ వస్తుంది. ఇవి పొట్టిగా ఉన్న వారికి అకాల మరణం, నాడీ క్షీణత జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు పలు రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే డీఎన్ఏ మెథిలేషన్ ఒక కణాన్ని నడిపించే ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోవచ్చు. ఈ రెండూ ఆరోగ్యంగా ఉండే శారీరక వృద్ధాప్యాన్ని తగ్గించుకోవచ్చు.

ఎక్కువ రోజులు బతకకపోయినా.. బతికినంత కాలం హాయిగా, సుఖంగా జీవించాలంటే కచ్చితంగా ఈ రెండింటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహార, విహారాలను మార్చుకోవడం ద్వారా శారీరకంగా త్వరగా వృద్ధులు కాకుండా చూసుకోవచ్చు. మంచి జీవనశైలి మూలంగా టెలోమేర్స్ పొడవు పెరుగుతున్నట్లు వృద్దాప్యం వెనక్కి వెళ్తున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.