Begin typing your search above and press return to search.

ఈటల కాంగ్రెస్ లోకి.. లెక్క ఇదేనా?

By:  Tupaki Desk   |   30 May 2023 5:42 PM GMT
ఈటల కాంగ్రెస్ లోకి.. లెక్క ఇదేనా?
X
ఊరికే అనరు మహానుభావులు అని.. ఏదైనా అన్నారంటే ఆ నేతల మనసుల్లో ఏదో గూడుకట్టుకొని ఉందని అర్థం చేసుకోవాలి.. కేసీఆర్ భయానికి.. కేసుల భయానికి మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారని అనుకోవాలి. చాలా మంది టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు అధికార పార్టీ నుంచి తమను తాము కాపాడుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. అంతే తప్పితే బీజేపీపై ప్రేమతోనో.. లేక ఆ పార్టీకి ఇక్కడ ఉన్న బలంతోనో కాదు.. బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా బలం లేదు. తెలంగాణలో మాత్రం అధికారం దిశగా ఆలోచించినా ఆ బలం సరిపోవడం లేదన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది.

తెలంగాణలోని 119 నియోజవర్గాల్లో బీజేపీకి బలం లేదు. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదన్నది బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న వాస్తవం. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి 30 సీట్లలో కూడా అభ్యర్థులు లేకపోవడం పెద్ద మైనస్ గా అభివర్ణిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కి బీజేపీకి లోపల అవగాహన ఉందన్న అనుమానాలు బోలెడన్నీ ఉన్నాయి. అధికారం కోసం సీట్ల కోసం ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ ను చీట్ చేస్తున్నాయన్న అనుమానాలు కాంగ్రెస్ లో ఉన్నాయి.

ఉత్తర తెలంగాణలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. దక్షిణ తెలంగాణలో బీజేపీకి అసలు క్యాడర్ , నేతలు లేరు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. స్వీప్ చేయబోతోందని అంటున్నారు. బీఆర్ఎస్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా క్యాడర్, నేతల బలం కేవలం కాంగ్రెస్ కే ఉంది. బీఆర్ఎస్ కి సరైన పోటీ కాంగ్రెస్ యేనన్నవాదన ఉంది.

వచ్చే ఎన్నికల్లో మోడీ ఎఫెక్ట్ ఉండదు అని ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీకి కష్టం అని అంటున్నారు. బండి సంజయ్ కు అంత సీన్ లేదు అని చెబుతున్నారు. తెలంగాణలో బలం, బలగం లేని బీజేపీకి గెలిచేంత స్టామినా లేదన్నది విశ్లేషకుల భావన..

అందుకే బలవంతంగా మోహమాటానికి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టారు. పొంగులేటి, జూపల్లి లాంటి వారు బీజేపీ కంటే కాంగ్రెస్ లోకి వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారని.. ఎందుకంటే ఖమ్మం, మహబూబ్ నగర్ లో అసలు బీజేపీ బలం లేకపోవడమే కారణం అంటున్నారు. తెలంగాణలో ఏ రకంగా చూసినా బీజేపీ కంటే కాంగ్రెస్ బలమైన పార్టీ అని ఈటల ఒప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే ఈటల కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరి పోటీ చేయవచ్చన్న చర్చ సాగుతోంది.

ఈటల ఈ మాటలు అన్నారో లేదో రేవంత్ రెడ్డి టీం రగంలోకి దిగిందని ఈటలను టచ్ లోకి తీసుకొని సంప్రదింపులు జరుపుతున్నట్టు భోగట్టా. ఈటల వస్తే కాంగ్రెస్ కు ఖచ్చితంగా బలమే. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.