జగన్ పధకానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రచారం ?

Wed Mar 22 2023 08:28:31 GMT+0530 (India Standard Time)

Is YSRCP Scheme Name For Mahesh Film Possible

ఏపీలో జగన్ పాలన సాగుతోంది. జగన్ అనే నేన్ అంటూ 2019లో వైఎస్ జగన్ సీఎం గా ప్రమాణం చేశారు. దీనికంటే మూడేళ్ళ ముందు మహేష్ బాబు భరత్ అనే నేను అని సినిమా తీశారు. అందులో ఆయన యంగ్ అండ్ డైనమిక్ సీఎం గా నటించారు. ఒక విధంగా మహేష్ బాబు చేసిన పనులు ఆయన ఆ సినిమాలో చూపించినవి కొన్ని ఏపీ సీఎం జగన్ చేసి చూపించారు.



ఘట్టమనేని ఫ్యామిలీకి కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. ముఖ్యంగా వైఎస్సార్ తో సూపర్ స్టార్ క్రిష్ణకు బంధం ఉంది. ఆయన కుమారుడు మహేష్ బాబుకు జగన్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయన సర్కార్ వారి పాటలో జగన్ సూపర్ పాపులర్ డైలాగ్ అయిన నేను ఉన్నాను విన్నాను అని చెప్పడం కూడా సెన్షేషనల్ అయింది. ఒక విధంగా మహేష్ ఫ్యాన్స్ కి జగన్ ఫ్యాన్స్ కి ట్యూనప్ అయింది అంటారు.

మహేష్ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఆయన సొంత బావ గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నా మహేష్ రాజకీయ ప్రచారం కోసం వచ్చినది లేదు. అయిఏ వైఎస్సార్ ఫ్యామిలీకి మాత్రం క్రిష్ణ ఫ్యామిలీ కొంత కట్టుబడి ఉంటారని అంటారు. ఇపుడు దానిని మరికాస్తా అవును అనిపించేలా మహేష్ బాబు 28వ సినిమాకు జగన్ పధకాలలలో పాపులర్ అయిన అమ్మ ఒడి పధకం పేరు పెడతారు అని ప్రచారం సాగుతోంది.

జగన్ అమ్మ ఒడి పధకం ఏపీలో సక్సెస్ అయింది. ఈ పధకం ఆయన్ని అధికారంలోకి తీసుకువచ్చింది. ఇపుడు దీన్ని మహేష్ త్రివిక్రం శ్రీనివాస్ సినిమాకు టైటిల్ గా ప్రకటిస్తారు అంటున్నారు. త్రివిక్రం సినిమాలలో ఆ సెంటిమెంట్ ఉంది. దాంతో ఆ సెంటిమెంట్ ని మరోసారి పండిస్తూ ఈ టైటిల్ ని ఎంచుకుంటున్నారు అని అంటున్నారు. పైగా ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ కూడా ఉందని అందుకే ఈ టైటిల్ యాప్ట్ అని అంటున్నారుట.

మొత్తానికి ఈ టైటిల్ విషయంలో అఫీషియల్ గా ఏమీ తెలియడం లేదు కానీ అపుడే వైసీపీ వారు మత్రం సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ మా జగనన్న పధకం అంటూ అమ్మ ఒడిగా ముందుకు తీసుకువస్తున్నార. అది నిజమా కాదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ అదే టైటిల్ కనుక పెడితే జగన్ పధకానికి విస్తృతమైన ప్రచారం లభించడం ఖాయం.

ఎందుకంటే ఎన్నికల వేళ ఈ పధకాలే వైసీపీకి ఊపిరిగా ఉంటూ వస్తున్నాయి. పైగా మహేష్ బాబు సినిమా కూడా ఎన్నికలకు దగ్గర చేసి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దాంతో కలసి వచ్చే టైంలో జనం నోళ్ళలో నానే టైటిల్ గా ఇది తమకు బాగా ఉపయోగపడుతుంది అని వైసీపీ వారు భావిస్తున్నారు అంటే ఆ హుషారే వేరు కదా. ఇంతకీ ఆ టైటిల్ బయటకు వస్తేనే ఈ కధంతా సాగేది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.