Begin typing your search above and press return to search.

డీ విటమిన్​ లోపం ఉన్నవాళ్లకే 80 శాతం కరోనా! సర్వేలో విస్తుపోయే వాస్తవాలు

By:  Tupaki Desk   |   29 Oct 2020 7:10 AM GMT
డీ విటమిన్​ లోపం ఉన్నవాళ్లకే  80 శాతం కరోనా!  సర్వేలో విస్తుపోయే వాస్తవాలు
X
కరోనా పేరిట రోజుకో అధ్యయనం, పూటకో సర్వే ఫలితాలు వస్తూ జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కొత్త రోగం కావడం.. ఆ వ్యాధిపై ఇంకా అధ్యయనాలు జరుగుతుండటంతో ఏ రోజు ఏ నిజం బయటపడుతుందో తెలియడం లేదు. తాజాగా విటమిన్​ డీ లోపం ఉన్నవాళ్లకు కరోనా వచ్చే అవకావం ఎక్కువగా ఉందని ఓ సర్వే తేల్చింది. స్పెయిన్ ‌లోని ఓ ఆస్పత్రిలో నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటొకి వచ్చాయి. సదరు ఆస్పత్రిలోని కరోనా రోగులను పరీక్షిస్తే.. వారిలో 80 శాతం మంది విటమిన్​ డీ లోపంతో బాధపడుతున్నట్టు తేలింది.

స్పెయిన్​లోని శాంటాండర్‌లోని యూనివర్శిటీ హాస్పిటల్ మార్క్యూస్ డి వాల్డెసిల్లా కు చెందిన పరిశోధకులు కరోనా బాధితులపై అధ్యయనం చేశారు. మార్చి 10 నుంచి మార్చి 31 మధ్య కాలంలో కరోనా 216 మంది కరోనా బాధితులపై అధ్యయనం చేశారు. వారి శరీరంలో ఉన్న విటమిన్​ డీ స్థాయిని నమోదు చేసుకున్నారు.మరోవైపు అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒకే వయస్సు వారిలో విటమిన్ డీ విటమిన్ అదుపులో ఉన్న 197 మంది కరోనా బాధితులతో పోలిస్తే.. ఆస్పత్రిలో చేరిన 216 మంది కరోనా బాధితుల్లో విటమిన్ డీ లోపం ఉందని పరిశోధకులు గుర్తించారు.

వీరిలో 19 మంది నోటి ద్వారా విటమిన్ డి సప్లిమెంట్లను మూడు నెలలకు పైగా తీసుకున్నవారిని ప్రత్యేకంగా పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల్లో 82 శాతం మందిలో (సప్లిమెంట్ తీసుకోనివారు) విటమిన్ డీ లోపం ఉందని గుర్తించారు. మరోవైపు కంట్రోల్డ్ గ్రూపులో 47 శాతం మందిలో ఒకే రకమైన లోపం ఉందని గుర్తించారు. మహిళలతో పోలీస్తే పురుషుల్లో విటమిన్​ డీ లోపం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. విటమిన్​ డీ లోపం ఉన్నవారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. గుండె జబ్బులు, డయాబెటిస్, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండే వారిలో విటమిన్​ డీ లోపం అధికంగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.