Begin typing your search above and press return to search.

అయినా అసంతృప్తులే.. బాబు ఫార్ములా బెడిసి కొట్టిందా?

By:  Tupaki Desk   |   23 Oct 2020 4:00 AM GMT
అయినా అసంతృప్తులే.. బాబు ఫార్ములా బెడిసి కొట్టిందా?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు వేసిన వ్యూహం బెడిసి కొడుతోందా? పార్టీలో తిరిగి పూర్వ ఉత్తేజం తెచ్చేదిశ‌గా ఆయ‌న వేసిన అడుగులు రాంగ్ ప‌డ్డాయా? కొన్ని జిల్లాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. వెలుగు చూస్తున్న ఘ‌ట‌న‌లు ఇలాంటి ప్ర‌శ్న‌ల‌నే తెర‌మీదికి తెస్తున్నాయి. పార్టీలో గ‌తంలో ఎన్న‌డూ లేని పార్ల‌మెంట‌రీ జిల్లా క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. యోధాను యోధులైన పార్టీ నేత‌ల‌తోపాటు.. యువ‌నేత‌ల‌కు కూడా అవ‌కాశం ఇచ్చారు.

అదేస‌మ‌యంలో పార్టీలో రాష్ట్ర క‌మిటీని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేశారు. బీసీల‌కు పెద్ద‌పీట వేశారు. అదేస‌మ యంలో పార్టీ విధాన నిర్ణ‌యాక క‌మిటీ అయిన పొలిట్ బ్యూరోను కూడా స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశారు. ఇలా వ్యూహాత్మ‌కంగాఅడుగులు ప‌డినా.. ఎక్క‌డో చిన్న చిన్న పొర‌పాట్లు చోటు చేసుకున్నాయి. వాస్త‌వానికి ఈ క‌మిటీల ఏర్పాటుకు బాబు తీవ్రంగానే క‌స‌ర‌త్తు చేశారు. ఎవ‌ని ఉంచాలి? ఎవ‌రి ప‌క్క‌న పెట్టాల‌నే విష‌యంలో ఆయ‌న అన్ని స‌మీక‌ర‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. అయినా.. అసంతృప్తులు చ‌ల్లార‌లేద‌నే వార్త‌లు ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు శ్రీకాకుళం జిల్లాలోనే ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు తీవ్రంగా విమ‌ర్శ‌లు గుపిస్తున్నారు.వీరిలో కీల‌క‌మైన ఎస్సీ నాయ‌కురాలు.. మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమె నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా పొలిట్ బ్యూరోలో మెంబ‌ర్‌గా ఉన్నారు. అయితే, ఆమెను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించి.. పార్టీ ఉపాధ్య‌క్షురాలిగా నియ‌మించారు. అయితే, త‌న క‌న్నా సీనియార్టీ త‌క్కువ‌గా ఉన్న అనేక మందికి ఇవే ప‌దవులు ఇవ్వ‌డం, త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న పొలిట్ బ్యూరో ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం ఆమె ఆగ్ర‌హానికి కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. ఈ ప‌ద‌వి త‌న‌కు అవ‌స‌రం లేద‌ని ఆమె ఇప్ప‌టికే చంద్ర‌బాబు లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, ఇదే జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గౌతు శ్యాం సుంద‌ర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష కూడా అంతే ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆమెగ‌త ఏడాది ఎన్నిక‌ల వ‌రకు కూడా జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. అయితే, ఆమెను అనూహ్యంగా త‌ప్పించిన చంద్ర‌బాబు ఆశించిన ప‌ద‌వి ఇవ్వ‌లేదు. దీంతో ఆమె కూడా ఫైర్ అవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చిన‌ప్ప‌టికీ... అసంతృప్త నేత‌ల‌ను స‌ర్దుబాటు చేయ‌ని కార‌ణంగా తాను ఓడిపోయాన‌నే ఆవేద‌న‌లో ఉన్న ఆమె.. ఇప్పుడు ఏకంగా పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేక‌పోవ‌డంపై తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్నారు. ఇలా వీరిద్ద‌రే కాదు.. అనంత‌పురం, చిత్తూరు, క‌ర్నూలు.. ఇలా చాలా జిల్లాల్లో మ‌హిళా నాయ‌కులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీనిని బ‌ట్టిబాబు ఫార్ములా బెడిసి కొట్టిందా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.