Begin typing your search above and press return to search.

టీడీపీ నాలెడ్జ్ సెంటర్ వీక్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   3 Aug 2020 11:37 AM GMT
టీడీపీ నాలెడ్జ్ సెంటర్ వీక్ అయ్యిందా?
X
టీడీపీ అంటేనే బలమైన మీడియా.. సోషల్ మీడియాలతో తిమ్మిని బమ్మి చేయగల సామర్థ్యం ఆ పార్టీ సొంతమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. గోబెల్స్ ప్రచారంలో టీడీపీని మించిన పార్టీ లేదంటారు. ముఖ్యంగా టీడీపీ నాలెడ్జ్ సెంటర్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అది బ్రహ్మాండమైన నెట్ వర్క్ కలిగి ఉంది. ఏకంగా డిజిటల్ లైబ్రరీనే మెయింటేన్ చేస్తోంది. మీడియాకు ఎవరు అయినా డిబేట్ కి వెళ్తే వాళ్లకు సమాచారం ఇస్తూ టీడీపీ లైబ్రరీ నాణ్యతగా మాట్లాడించే సెంటర్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది.

కానీ ఈ మధ్య కాలంలో అది గతి తప్పినట్టు ఉన్నది. ఎందుకంటే నిన్న ఒక టీడీపీ మాజీ మంత్రి మూడు రాజధానులు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని విమర్శించారు. ఆ మాజీ మంత్రికి తెలిసి మాట్లాడినా.. తెలియక మాట్లాడినా అర్థం కాలేదు అంటున్నారు టీడీపీ వర్గీయులు. ఎందుకంటే అమరావతి రాజధాని చేసిందే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దాని వాల్యూ ఒక లక్ష కోట్లు సంపాదిస్తుంది అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్తున్నాడు. ఎక్కడ ఆఫీసులు వచ్చినా అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ వస్తుందని.. ఆ మాజీ మంత్రికి తెలియకపోవడం టీడీపీ వర్గాలు ఆశ్యర్యకరంగా ఉందని అంటున్నారు.

ఇలా మూడు రాజధానులను రియల్ ఎస్టేట్ కోసం అన్న ఆ టీడీపీ మాజీ మంత్రి... అమరావతిని కూడా చంద్రబాబు అలానే కట్టాడన్న అర్థం వచ్చేలా నోరుజారడం టీడీపీ పరువు తీసేలా మారింది. ఇలాంటి నేతలకు కనీసం అవగాహన కల్పించడంలో టీడీపీ నాలెడ్జ్ సెంటర్ వీక్ అయిపోయిందన్న చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది.