శ్రీరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధినా?

Thu Jan 20 2022 20:00:02 GMT+0530 (India Standard Time)

Is Sri Reddy YCP spokesperson?

నటి శ్రీరెడ్డి.. తెలుగు సినిమా రంగంలోని పెద్దలు తనకు అవకాశాలు ఇవ్వడం లేదని.. తనను అవకాశాల పేరుతో వాడుకోవాలని చూశారని సంచలన ఆరోపణలతో విమర్శల్లోకి ఎక్కారు. కొంతమంది నటుల మీద తీవ్రమైన విమర్శలు చేశారు. బూతులతో మాటల దాడి కొనసాగిస్తున్నారు. బయట అర్ధనగ్న ప్రదర్శనకూ వెనుకాడలేరు. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీపై ఎవరైనా విమర్శలు చేస్తే.. వాళ్లను తీవ్రమైన పదజాలంతో ఆమె టార్గెట్ చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా బూతులతో ప్రత్యర్థి నాయకులపై ఆమె విరుచుకుపడుతున్నారు. దీంతో ఆమె వైసీపీ అధికార ప్రతినిధినా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా.. శ్రీరెడ్డి ఇప్పుడు కూడా ఆయన్ని లక్ష్యంగా చేసుకుని బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక టీడీపీకి చెందిన ఎవరైనా నాయకులు కూడా జగన్ను విమర్శిస్తే ఆమె రంగంలోకి దిగుతున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా తన స్థాయిని దాటి ఆమె టికెట్ల వ్యవహారంలో సినిమా పెద్దల మీద విరుచుకుపడుతున్నారు. ఆమె ఏదో పెద్ద స్టార్ అన్నట్లు  పద్ధతి లేకుండా విచక్షణ మరిచి మాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏదో యూట్యూట్ వీడియోలు చేసుకుంటూ ఆమె వైసీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓ వైపు జగన్పై విమర్శకులకు శ్రీరెడ్డి తనదైన శైలిలో సమాధానం చెబుతుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం ఆమె తీరుతో నెత్తి కొట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ నాయకులే అంటున్నారని సమాచారం. ఆమె పార్టీకి మద్దతుగా మాట్లాడితే సరే కానీ తాను ఉపయోగిస్తున్న భాషతో చెడ్డపేరు వస్తుందని నాయకులు అభిప్రాయపడుతున్నారని టాక్. ఆమె పార్టీ గురించి మాట్లాడితే చెడ్డ పేరు వస్తుంది తప్ప కలిగే ప్రయోజనం ఏమీ లేదని అంటున్నారు. ఆమె వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో శ్రీరెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు.