చంద్రబాబుకి మాజీ ఎంపీ వార్నింగ్?

Tue Aug 04 2020 15:40:22 GMT+0530 (IST)

Is Rayapati Samba Siva Rao Gave Strong Warning To Cbn?

ఎన్నికల్లో టీడీపీ అధినేత ఓడిపోయాక ఆయన పరిపతి దారుణంగా పడిపోయిందా? నేతలు ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదా? అవసరార్థం వాడుకునే బాబు రాజకీయాలను ఈసడించుకుంటున్నారా? ప్రకటిస్తావా? పార్టీ మారిపోవాలా అని ఒత్తిడి తెస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తాజాగా చంద్రబాబుకి ఫోన్ చేసి మా కొడుకుకు ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ సీటు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారట.. చంద్రబాబు ఏదో చెప్పబోతుంటే నానబెట్టవద్దని స్పష్టం చేశారట.. సత్తెనపల్లి ఇస్తావా లేదా అని తేల్చిచెప్పాలని.. లేకుంటే మాది మేము చూసుకుంటాం అని చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చాడని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ మేరకు టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

సత్తెన పల్లి అసెంబ్లీ టికెట్ ను ఇప్పుడే తమకు ప్రకటించాలని రాయపాటి కుటుంబం ఒత్తిడి తెస్తోంది. ఇప్పటినుంచే పనిచేసుకుంటే పోతే రాబోయే ఐదేళ్లకు గెలుస్తామని.. అందుకే ముందుగానే తమకు సీటు ఇవ్వాలని.. నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రకటించాలని చంద్రబాబుపై రాయపాటి ఒత్తిడి తెచ్చారట.. కానీ చంద్రబాబు మాత్రం చాలా అలిగేషన్స్ ఉన్న ఈ సీటుపై ఏ సమాధానం ఇవ్వకుండా దాటవేయడంతో రాయపాటి నిలదీసినట్టు తెలుస్తోంది.