Begin typing your search above and press return to search.

రూ. 500 నోట్లు కూడా దెబ్బేస్తాయా?

By:  Tupaki Desk   |   2 Jun 2023 9:00 PM GMT
రూ. 500 నోట్లు కూడా దెబ్బేస్తాయా?
X
భారతీయ రిజర్వు బ్యాంకు 2000 నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే దీని ప్రభావం సామాన్యులపై అంతగా ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే 2018 సంవత్సరం నుంచి 2000 నోట్ల ముద్రనలను రిజర్వ్ బ్యాంక్ ఆపేసింది. ఇప్పటివరకు సర్క్యులేషన్లో ఉన్న 2000 నోట్లు ... 2017 కు ముందు జారీ చేసినవే. వీటిని మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు సమయం కూడా ఇచ్చింది.

అయితే 2000 నోట్ల ఉపసంహరణ అంశంతో మరో చర్చ మొదలైంది. పెద్ద నోట్ల రద్దులో భాగంగానే 500 నోట్లను కూడా రద్దు చేస్తారా అనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. 2016 లో మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత 2000 రూపాయలు, 500 వందల రూపాయల నోట్లను తీసుకువచ్చారు.

అప్పట్లో సామాన్యులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అప్పటితో పోలిస్తే... ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. దీనితో సామాన్యులపై ఈ ప్రభావం అంతగా చూపించకపోవచ్చు. అయితే 500 రూపాయల నోటు కూడా రద్దు చేస్తారా అనే ఆలోచన ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు తరువాతి నిర్ణయం రూ 500 మీద ఉంటుందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

రూ 500 నోటుతోనే పెద్ద సంఖ్యలో లావా దేవీలు కొనసాగుతున్నాయి. రెండు వందల నోట్లు, వంద నోట్లు ఉన్నా.. ఇప్పుడు 500 నోట్ల రద్దు చేయటం అంత సులువైన నిర్ణయం కాదనేది ఆర్దిక వేత్తల అంచనా వేస్తున్నారు. గతంలో ఉన్న అనుభవాలతో కేంద్రం నేరుగా నోట్ల రద్దు ఆలోచన చేయదని భావిస్తున్నారు.

ప్రస్తుతం చెలామణిలో ఉన్న నగదులో రూ 500 నోట్ల వాటా 72 శాతంగా ఉన్నట్లు లెక్కలు చెబుతుండగా... అదే సమయంలో చెలామణిలో మాత్రం 37 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం 500 నోట్ల రద్దు వంటి నిర్ణయాల దిశగా అడుగులు వేయదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే... భారీ మొత్తంలో రూ.2 వేల నోట్లు ఉన్నవారు మార్చుకోవడానికి, వాటిని వదిలించుకోవడానికి కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బంగారం, స్థిరాస్తి కొనుగోళ్లపై దృష్టి పెట్టగా.... తాజాగా వేతనాల రూపంలో ఇచ్చేస్తున్నారు. ఇలా జూన్‌ 1న నగరంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది.