పీకే అట్టర్ ఫ్లాపయ్యారా ?

Mon Sep 26 2022 10:31:40 GMT+0530 (India Standard Time)

Is Prashant Kishore Failed as Political Strategist

రాజకీయ వ్యూహకర్తలు  దేశం మొత్తంలో చాలామందే ఉన్నారు. వీరిలో ప్రశాంత్ కిషోర్ (పీకే) అత్యంత పాపులర్ అనటంలో సందేహం లేదు. ఈయనకు ఇంతటి పాపులారిటీ ఎలాగ వచ్చిందంటే 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వటంతోనే.అప్పట్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావటం ప్రత్యేకంగా మోడీని ప్రధాని చేయటం కోసమే పీకే పనిచేశారు. అదృష్టం ఎవరిదో కానీ ఇద్దరు సక్సెస్ అయ్యారు. అప్పటి నుండి పీకే పాపులారిటి పెరిగిపోతునే ఉంది.

అయితే ఇదే పీకే యూపీలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటంలో ఘోరంగా ఫెయిలయ్యారు. ఇలాంటి గెలుపోటములు పీకే ఖాతాలో చాలానే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే పీకే వల్లే ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీలకే ఆయన పనిచేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇందులో ఏది నిజం ఏది అబద్ధమన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే గోవా ఎన్నికల్లో పీకే అట్టర్ ఫ్లాప్ అయ్యారన్నది నిజం.

ఈ మధ్యనే జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పీకే పనిచేశారు. అంతకుముందే బెంగాల్లో తృణమూల్ కు పీకే పని చేయటం మమత బ్రహ్మాండమైన మెజారిటీతో మూడోసారి వరుసగా అధికారంలోకి రావటం అందరికీ తెలిసిందే.

అందుకనే గోవాలో పార్టీ గెలుపుకోసం పీకేకి బాధ్యతలు అప్పగించారు. 40 సీట్లున్న గోవాలో మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)తో పొత్తు పెట్టుకుని తృణమూల్ పోటీ చేసింది.  తృణమూల్ పోటీ చేసిన 23 సీట్లలో ఒక్క దానిలో కూడా గెలవలేదు.

 పైగా అన్ని పార్టీల కన్నా అత్యధికంగా రు. 47.54 కోట్లు ఖర్చు చేసింది. అధికారంలో ఉన్న బీజేపీ అందరి అభ్యర్ధుల ఖర్చు రు. 17.75 కోట్లు మాత్రమే. అభ్యర్ధులను ముందే నిర్ణయించుకున్నా అందరికన్నా అత్యధికంగా డబ్బులు ఖర్చుచేసినా ఎంజీపీ లాంటి గట్టి పార్టీతో పొత్తు పెట్టుకున్నా చివరకు  పీకే లాంటి ఉద్దండుడి మార్గదర్శకం ఉన్నా ఒక్కసీటులో కూడా ఎందుకు గెలవలేదు ? ఎందుకంటే గోవాలో తృణమూల్ కు గెలిచేంత సీన్ లేదు కాబట్టే. మరి ఎన్నికలకు ముందు పీకే ఏమి సర్వేలు చేశాడో ఏమి నివేదికలు ఇచ్చాడో ఎవరికీ తెలీదు కానీ రిజల్టయితే పీకే అట్టర్ ఫ్లాప్.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.