Begin typing your search above and press return to search.
కాపునని చెప్పుకొనేందుకు జంకెందుకు పవనూ..!
By: Tupaki Desk | 13 March 2023 3:30 AM ISTతాను అన్ని కులాలకు చెందిన వాడినని.. తనకు ఒక కులాన్ని ప్రేమించడం.. మరో కులాన్ని ద్వేషించ డం సాధ్యం కాదని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే.. రాజకీయాల్లో ఇది సహజ మే. ఇలానే చెప్పాలి కూడా. లేక పోతే.. ఒకే కులానికి చెందిన పార్టీ అనే ముద్ర పడిపోతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. అయితే.. అలాగని.. తన సొంత కులాన్ని ఎందుకు వదిలి పెట్టాలి? అనేది కూడా ఇక్కడ ప్రశ్న.
ఎందుకంటే.. పవన్ కాదన్నా.. ఔనన్నా.. ఆయనను కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. దీనిపై క్లారిటీ లేకపోవడం వల్ల.. పవన్ చేస్తున్న ఇలాంటి ప్రకటనల వల్ల.. వారు పార్టీకి దూరమవుతున్నారనేదివాస్తవం.
గత ఎన్నికల్లోనే వాస్తవానికి పవన్ కు అండగా నిలిచి ఉండాల్సింది. కానీ.. పవన్ వారికి చేరువ కాలేక పోయారు. ఇక,ఈ నాలుగేళ్ల కాలంలోనూ.. పవన్. వారికి చేరువ అయ్యారా? అంటే.. ఎప్పటికప్పుడు పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో కాపులకు ఎంతెంత దూరం అంటే.. అనే పరిస్థితిలోనే ఉన్నారు.
సో.. ఇప్పుడు మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ తనను తాను కాపు నాయకుడిగా ఎందుకు ప్రొజెక్టు చేసుకోకూడదు.. ఎందుకు తాను కాపునని చెప్పుకోకూడదు..? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
జగన్ తను రెడ్డినని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండానే.. ఆ వర్గానికి చేరువయ్యారు. వారే గత ఎన్నికల్లో జగన్కు అండగా నిలిచి గెలిపించారు. ఇక, టీడీపీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నది కూడా.. కమ్మలే.
సో.. ఏ పార్టీకి.. ఆ పార్టీ కులాలతోనే ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అన్ని వర్గాల ను కలుపుకొని పోతున్నారు. దండలో దారంగా పార్టీలను, నాయకులను కులమే నడిపిస్తున్నప్పుడు.. పవన్ ఎందుకు జంకుతున్నట్టు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాపు వర్గానికి చేరువ కావడం ద్వారా.. నాలుగు జిల్లాలను శాసించే స్థాయికి చేరుకునే పరిస్థితి ఉంది. దీనిని తోసిపుచ్చి.. తాను తటస్థంగా ఉంటాను అని చెప్పడం ద్వారా.. కామ్రెడ్ల తరహాలోనే రాజకీయాలు చేస్తున్నట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.