ఖద్దర్ ను మోడి ప్రమోట్ చేస్తున్నారా ?

Sun Oct 25 2020 18:30:16 GMT+0530 (IST)

Is Modi promoting Khaddar?

ఖద్దర్ బట్టలను ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రమోట్ చేస్తున్నట్లే ఉంది. ఇంతకాలం లేని ఖద్దర్ వస్త్రాల గురించి మోడి ఎందుకింతగా ఆసక్తి చూపుతున్నారో తెలీదు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో ఖాదీ బట్టలకు డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు. ఆత్మనిర్భర్ లోకల్ టు వోకల్ ప్రోగ్రాములకు అసలు సిసలైన నిర్వచనంలా మారిందన్నారు. మెక్సికోలోని ఒహాకాలో స్ధానిక మెక్సినక్ బ్రౌన్ రకం ఖద్దర్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు.ఖద్దర్ ను ఇఫుడెవరు సాధారణ బట్టగా చూడటం లేదని చెప్పటం గమనార్హం. కరోనా వైరస్ నేపధ్యంలో ఖాదీ వస్త్రాలతో చేసిన మాస్కులకు బాగా డిమాండ్ పెరుగుతోందన్నారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ప్రతిరోజు వేలాది ఖద్దర్ మాస్కులను తయారు చేస్తున్నట్లు మోడి తెలిపారు. ఇక అమెరికాలోని చిన్మయ్ పాఠంకర్ మల్లయోధులను తయారు చేస్తున్న విషయాన్ని మోడి ప్రస్తావించారు. భారత్ తరహా మల్లయుద్ధంపై అమెరికాలోని యువత ఆసక్తి చూపటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారతీయులు విస్మరించిన మల్లకంబంను అమెరికా యువత నేర్చుకోవటం మనకు గర్వకారణమనే చెప్పారు.

పనిలో పనగి తమిళనాడుకు చెందిన తిరువక్కురళ్ ను దేశంలోని ప్రతి ఒక్కరు చదవాలని మోడి ప్రస్తావించారు. అసలు తిరువక్కురళ్ అంటే ఏమిటి ? దేశంలోని మిగితా ప్రాంతాల వాళ్ళు ఎందుకు చదవాలో మాత్రం మోడి చెప్పలేదు. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన పొన్ మరియప్పన్ను మోడి తమిళంలోనే పలకరించారు. చివరగా దసరా పండుగ రోజున బజారుకెళ్ళాలంటే కూడా పరిస్ధితిలు అనుకూలించకపోవటం బాధా కరమన్నారు. గుజరాత్ లోని గర్భ పశ్చిమబెంగాల్లోని కాళికా అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిట లాడే విషయాన్ని మోడి గుర్తు చేసుకున్నారు.