Begin typing your search above and press return to search.

మోడీకి అల్ టర్ నేటివ్ యోగియేనా?

By:  Tupaki Desk   |   10 Jun 2021 7:30 AM GMT
మోడీకి అల్ టర్ నేటివ్ యోగియేనా?
X
75 ఏళ్లు దాటిన రాజకీయ నాయకులు పదవుల్లో ఉండరాదని మోడీ-షాల నేతృత్వంలోని బీజేపీలో కొత్త శాసనం అమలు చేస్తున్నారు. అందుకే అద్వానీ నుంచి జోషి, యశ్వంత్, జశ్వంత్, ఉమాభారతి, మేనకాగాంధీ లాంటి ఎంతో మందిని వయోభారంతో పక్కనపెట్టారు. వయసు దాటిన కర్ణాటక సీఎంను మార్చేందుకు చూస్తున్నారు. అయితే ప్రధాని మోడీ కూడా వచ్చే ఎన్నికల నాటికి వ్యతిరేకత వస్తే మరో ప్రత్యామ్మాయ నేతను పెట్టాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే యూపీ ఎన్నికలు వస్తున్నాయి. ఇంకా కొన్ని నెలలు మాత్రమే దానికి సమయం ఉంది. దీంతో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో మోడీ ఫెయిల్యూర్ తో వెనుకబడ్డారు. ఆ రాష్ట్రంలో బీజేపీకి మరోసారి అధికారం కష్టమేనంటున్నారు. ఇక థర్డ్ వేవ్, వ్యాక్సిన్ల కొరతతో జరగని వ్యాక్సినేషన్ మోడీ సర్కార్ వైఫల్యాన్ని చూపిస్తున్న వేళ యూపీలో గెలవడం కష్టమేనంటున్నారు.

యూపీ ఎన్నికల మీద ఇప్పటికే బీజేపీ-ఆర్ఎస్ఎస్ గట్టిగా దృష్టి సారించాయి. కరోనా సమయంలో వైఫల్యాలు బీజేపీపై వ్యతిరేకతకు దారితీయవచ్చని అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.. ఎక్కువ ఎంపీలున్న యూపీలో కనుక బీజేపీ ఓడిపోతే మరోసారి దేశంలో బీజేపీ రాదని తేటతెల్లమవుతుంది. బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని చెప్పక తప్పదు.

యూపీలో 2014 లోక్ సభ, 2017 అసెంబ్లీ , 2019 లోక్ సభ ఎన్నికల్లో సాధించిన తరహా విజయాలను బీజేపీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. బీజేపీ వేవ్ లేకపోతే ఇక దేశంలోనూ అధికారం కోల్పోక తప్పదు.

ఇక యోగి ప్రభుత్వ పనితీరును బీజేపీ సమీక్షిస్తోంది. యోగిని దించి మరొకరిని పెట్టాలా? అని ఆలోచిస్తున్నారు. అయితే తనను ఎవరూపదవి నుంచి దించరని యోగి ప్రకటించడం విశేషం. అయితే యూపీలో కనుక మరోసారి బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా యోగి అడుగులు ఢిల్లీ వైపు పడుతాయని.. హంగ్ వస్తే మోడీని కాదని.. యోగిని ప్రధానిని చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. యూపీలో బీజేపీ విజయావకాలశాలపైనే యోగి, మోడీ భవిష్యత్ ఆధారపడి ఉందంటున్నారు.