Begin typing your search above and press return to search.

కవిత ఇక డిసైడ్ అయినట్లేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2023 1:50 PM GMT
కవిత ఇక డిసైడ్ అయినట్లేనా?
X
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఎమ్మెల్యేగానా..? ఎంపీగానా..? అనే చర్చ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. 2014లో టీఆర్ఎస్ తరుపున నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి కవిత మొదటిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయలపైనే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కవితను రాష్ట్రానికి పరిమితం చేయనున్నారా..? లేక ఢిల్లీ తీసుకెళ్తారా..? అనే చర్చ ప్రారంభమైంది. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఖాయమని తెలుస్తోంది.ఎందుంకంటే..?

ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజామాబాద్ ఎంపీగా ఉన్న అర్వింద్ పై వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా పసుపు బోర్డుపై లిఖిత పూర్వ హామీ ఇచ్చిన అర్వింద్ పై పసుపు రైతులు అసహనంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యామ్నాయ వ్యక్తిని ఎన్నుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా గులాబీ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బలపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో అర్వింద్ కు ప్రత్యామ్నాయంగా కవితను ఫోకస్ చేసి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక సీట్లు సాధించి ప్రభుత్వంలో చేరితే కొన్ని డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని ప్రజలకు హామీలు ఇవ్వనున్నారు. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం మారితే బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఆ నిజామాబాద్ ఎంపీ సీటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ కవితకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆమెను పార్లమెంట్ కు పంపియ్యోచ్చు. అవసరమైతే కేంద్ర మంత్రిని కూడ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల నిజామాబాద్ కవితకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

2014లో కవిత పార్లమెంట్ కు వెళ్లిన సమయంలో ఆమెకు ఢిల్లీ పరిచయాలు బాగా పెరిగాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించగలిగారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతృత్వంలో ఆమె ఎంపీగా గెలిస్తే పార్టీని మరింత డెవలప్మెంట్ చేసే దిశగా కృషి చేస్తారని కేసీఆర్ అనుకుంటున్నారు. అదీ గాక ఇతర ఎంపీ స్థానాలను కదిలించే ప్రసక్తే లేదు. ఇప్పటికే కేసీఆర్ సిట్టింగులకే సీట్లు అని హామీ ఇచ్చారు. అందువల్ల ప్రస్తుతానికి నిజామాబాద్ ఎంపీ స్థానం ఖాళీగా ఉండడంతో కవిత అక్కడి నుంచి పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారని బీఆర్ఎస్ లో చర్చించుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.