Begin typing your search above and press return to search.

13 మంది ఎమ్మెల్యేలకు సీట్లు లేవు అని ఎమ్మెల్యేల మీటింగులో చెప్పబోతున్నారా...?

By:  Tupaki Desk   |   31 March 2023 6:00 PM GMT
13 మంది ఎమ్మెల్యేలకు సీట్లు లేవు అని ఎమ్మెల్యేల మీటింగులో చెప్పబోతున్నారా...?
X
ముఖ్యమంత్రి జగన్ సడెన్ గా ఎమ్మెల్యే మీటింగ్ ఏప్రిల్ మూడవ తేదీన ఏర్పాటు చేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికంటే విశేషం ఏమిటి అంటే జగన్ ఢిల్లీ టూర్లో ఉండగానే మూడున మీటింగ్ ఉంటుందని ఏర్పాట్లు చేయాలని పార్టీ పెద్దలకు ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. మరి జగన్ ఢిల్లీలో ఉండగా ఈ ఆలోచన ఎందుకు చేశారు, ఆయనను రాజకీయంగా ప్రభావితం చేసే అంశాలు ఏమిటి. ఢిల్లీలో ఏమి జరిగింది అన్న చర్చ ఒక వైపు సాగుతోంది.

ఇదిలా ఉండగా ఢిల్లీకి రెండు రోజుల టూర్ పెట్టుకుని వెళ్ళి వచ్చిన జగన్ ఏప్రిల్ మూడున మధ్యాహ్హం మూడు గంటలకు ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్ నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఈ మీటింగ్ లో ఏమి చెప్పబోతున్నారు అన్నదే కీలకమైన విషయంగా ఉంది. ఇప్పటికి చాలా సార్లు వర్క్ షాప్ పేరిట జగన్ ఎమ్మెల్యేలను మీటింగులకు పిలిచారు.

ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీదనే చర్చించారు. ఏ విధంగా ఎమ్మెల్యేలు జనాలలోకి వెళ్తున్నారు అన్నది ముఖ్యమంత్రి ఈ వర్క్ షాప్ లో మాట్లాడి వారి పని తీరు మీద రెడీ చేసిన సర్వే నివేదికలను కూడా వెల్లడించేవారు అని చెబుతూ ఉండేవారు. ఇక ఈసారి మాత్రం సడెన్ గా రివ్యూ మీటింగ్ అనౌన్స్ చేశారు.

మరి ఇది దేని మీద అన్నదే ఇపుడు అందరి మదినీ దొలుస్తున్న ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను వైసీపీ కోల్పోయింది. అలాగే ఎమ్మెలెయ కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటుని తెలుగుదేశానికి సమర్పించుకుంది. దీంతో అసలు ఏమి జరుగుతోంది. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది. గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీస్ ఏమిటి అన్న దాని మీద గడచిన కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్లుగా చెబుతున్నారు.

దాంతో ఏపీలో ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా చర్చ సాగుతోందని చెబుతున్నారు. ఇక గతంలో నిర్వహించిన వర్క్ షాప్ సందర్భంగా ఎమ్మెల్యేలలో ఎవరికి టికెట్ ఇస్తారో వచ్చే సమావేశాల్లఒ చెప్పేస్తారు అని ప్రచారం నడచింది. ఇపుడు చూస్తే ముందస్తు ఎన్నికలు అని అంటున్నారు. దాంతో ఏప్రిల్ మూడున జరిగే ఎమ్మెల్యేల రివ్యూ మీటింగులో జగన్ ఏ రకమైన సంచలన ప్రకటన చేస్తారు అన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది.

పార్టీ వర్గాలు గుసగుసలు అయితే ఏకంగా పదమూడు మంది ఎమ్మెల్యేలకు పనితీరు బాలేదని సీటు దక్కదని చెప్పేస్తారు అని అంటున్నారు. వారి పనితీరు ఏంటి అన్నది సర్వేల ద్వారానే వెల్లడించి ఇక మీ సేవలు చాలు అని శుభ వార్తను వినిపిసారు అని అంటున్నారు. అదే విధంగా వారి ప్లేస్ లోకి కొత్తగా ఇంచార్జిలను నియమిస్తారు అని చెబుతున్నారు.

ఎందుకంటే ముందస్తు ఎన్నికలు అంటే ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తుకోవాలి. పనితీరు బాలేని వారిని అలా మోస్తూ కంటిన్యూ చేస్తూ ఎన్నికలకు వెళ్లడం అంటే రిస్క్ తో కూడిన వ్యవహారం అని అంటున్నారు. అందువల్ల ఏ సంగతీ ఈ సమావేశంలో జగన్ కుండబద్ధలు కొట్టబోతున్నారు అని అంటున్నారు. నిజంగా కనుక జగన్ పదమూడు మంది ఎమ్మెల్యేలు వద్దు అని డెసిషన్ తీసుకుంటే ఏపీ రాజకీయాల్లో అది సంచలనం అవుతుంది అని అంటునారు.

అలా టికెట్ నిరాకరిస్తే ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేల మాదిరిగానే వారు కూడా రెబెల్స్ గా మారుతారా పార్టీ మీద ధిక్కార స్వరం వినిపిస్తారా అన్నది కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ సాగుతోంది. ఏది ఏమైనా జగన్ కీలక విషయాలను పంచుకోవడానికే ఎమ్మెల్యేలను అందరినీ పిలుస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.