రంగంలోకి చెవిరెడ్డి వారసుడు.. జగన్ హామీ ఇచ్చారా?

Fri Mar 31 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

Is Jagan Ticket For Chevireddy Son Mohith

ఏపీలో 2024లో వచ్చే  అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్గా మారనున్నాయనే విషయం తెలిసిందే. వైసీపీ టీడీపీ జనసేన మధ్య పోరు జోరుగా సాగనుంది. దీంతో అన్ని పార్టీలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నెక్ట్స్ చాన్స్ కోసం ఉవ్విళ్లూరుతున్న వైసీపీ అయితే.. ఇంకా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలి.. ఎక్కడ ఎవరిని ఏరేయాలి.. అనే విషయాల పై ఆచితూచి వ్యవహరిస్తోంది.ఈ క్రమంలో వారసులకు టికెట్లు లేవని.. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. దీంతో చాలా మంది తమ తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవాలని భావించినా.. అధినేత మాటకు కట్టుబడి.. దూరంగా ఉండిపోయారు. అయితే.. అందరు నేతల్లోనూ.. కొందరు నేతలు వైసీపీ అధినేత కు చాలా స్పెషల్. ఇలాంటి వారిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలక నాయకుడు.

ఒకరకంగా..చెప్పాలంటే.. సీఎం జగన్కు చెవిరెడ్డి.. స్నేహితుడు.. పీఏ.. ఇంటో మనిషి కూడా! అంతగా ఒదిగిపోయి.. వైసీపీ అధినేతకు అనుకూలంగా వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు.

చెవిరెడ్డి రాజకీయా ల్లోకి వచ్చేసరికి .. వైఎస్ ఉన్నప్పటికీ.. తర్వాత కొన్నాళ్లకే ఆయన మృతి చెందారు. దీంతో వైఎస్ కుమారు డిగా జగన్కు చిత్తూరు జిల్లాలో తొలిసారి జైకొట్టిన నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి.

ఇక అప్పటి నుంచి వీరిమధ్య బంధం.. అల్లుకుపోయింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి.. కుమారుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎంతో మంది అడిగినా.. కాదన్న జగన్.. చెవిరెడ్డి కుమారుడికి మాత్రం ఓకే చెప్పారని చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

దీనికి తగ్గట్టుగానే మోహిత్ కూడా.. నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో.. దీనిని బట్టి మోహిత్కు టికెట్ ఖరారైనట్టుగా.. వైసీపీ నేతలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం మోహిత్ రెడ్డి ఎంపీపీగా ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.