Begin typing your search above and press return to search.

అనిల్‌కు పెరుగుతున్న సెగ‌.. ఈసారి గెలుపు కూడా క‌ష్ట‌మేనా?!

By:  Tupaki Desk   |   28 March 2023 4:13 PM GMT
అనిల్‌కు పెరుగుతున్న సెగ‌.. ఈసారి గెలుపు కూడా క‌ష్ట‌మేనా?!
X
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత‌, ప్ర‌స్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌కుమార్ యాద‌వ్‌కు ముప్పేట దాడి పెరిగింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మిత్రులుగా ఉన్న‌వారు కూడా.. ఇప్పుడు శ‌త్రువులుగా మారిపోయారు. అంతేకాదు... నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. ఆయ‌న ఆధిప‌త్య చ‌లాయించిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిణామాలు మారిపోయాయి. దీంతో ఇప్పుడు అనిల్ ప‌రిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో కి మారిపోయిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. అనిల్ దాదాపు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నార‌నే పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే..ఇప్పుడు అవే నియోజ‌క‌వ‌ర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

అంతేకాదు... అనిల్‌ను ఓడించేందుకు కూడా నాయ‌కులు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. నెల్లూరురూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి ఇప్పుడు రెబ‌ల్‌గా మారిపోయారు. ఆయ‌న సోద‌రుడు గిరిధ‌ర్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గిరిధ‌ర్‌ను నెల్లూరు సిటీ(అంటే.. అనిల్ నియోజ‌క‌వ‌ర్గం) నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇది అనిల్ వ‌ర్గంలో ఆందోళ‌న‌కు దారితీస్తోంది. ఇప్ప‌టికే రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న అనిల్‌.. విష‌యంలో ఇక్క‌డిప్ర‌జ‌లు వ్య‌తిరేక‌తతో ఉన్నారు. సో.. దీనికి తోడు బ‌ల‌మైన గిరిధ‌ర్ వ‌ర్గం ఇక్క‌డ చ‌క్రం తిప్పితే.. అనిల్ గెలుపు ఏమాత్రం సాధ్యం కాద‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి కూడా .. వైసీపీకి దూర‌మ‌య్యారు. ఆయ‌న కూడా.. అనిల్ కేంద్రంగా విమ‌ర్శలు సంధిస్తున్నారు. దీంతో ఆయ‌న కూడా.. అనిల్‌కు వ్య‌తిరేకంగా సిటీలో చ‌క్రం తిప్పే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రీ ముఖ్యంగా అనిల్‌కు సొంత పార్టీ మంత్రి.. కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.. కంట్లో న‌లుసుగా మారుతున్నారు. అనిల్‌కు కాకానికి మ‌ధ్య విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే.

మంత్రి వ‌ర్గం నుంచి అనిల్‌ను తొల‌గించి.. కాకానికి ప‌ద‌వి ఇవ్వ‌డంతో తీవ్ర అల‌జ‌డి సృష్టించిన అనిల్ కేంద్రంగా కాకాని కూడా తెర‌చాటున చ‌క్రం తిప్పితే.. అనిల్ గెలుపు అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే జ‌రిగితే.. అనిల్‌కు ముప్పేట దాడి త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న గెలుపు కూడా క‌ష్ట‌మే అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక్క‌డ టీడీపీ కూడా అనిల్‌ను ఓడించాల‌నే కృత నిశ్చ‌యంతో ఉంద‌న్న విష‌యం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.