ఐ-టీడీపీ.. ప్రతి ఎమ్మెల్యే మీద డాక్యమెంటరీ వీడియోను త్వరలోనే రిలీజ్ చేస్తున్నారా?

Thu Sep 29 2022 23:59:26 GMT+0530 (India Standard Time)

Is ITDP to Release Documentary on Every MLA

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు నాయకు లు అన్నిరకాల అస్త్రాలను సంధిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏపీ వంటి రాష్ట్రాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తనకు ఉన్న అన్నిరకాల వ్యూహాలను అమల్లోకి తెస్తోంది. దీనిలో భాగంగా.. తన వైపు.. సానుకూల ప్రచారం చేసుకోవడం.. ఒక వ్యూహం అయితే.. అధికార పార్టీపై.. ఇప్పుడున్న పరిస్థితులను లింకు పెట్టి.. ఎమ్మెల్యేల వారీగా.. ప్రచారం చేయడం.. మరోవ్యూహం.ప్రస్తుతం.. ఈ వ్యూహం దేశంలో బీజేపీ అమలు చేస్తోంది. ఇది నిజం కూడా. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు.. ఏం చేశారు? అనే విషయాలపై కరపత్రాలు ప్రచురించి.. ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి కర్ణాటక బీజే పీలో కనిపించింది. ఇప్పుడు.. దీనికి మరికొంత హంగులు జోడించి.. టీడీపీ వ్యూహాన్ని రెడీ చేసుకుంటోందని అంటున్నారు. అంటే.. ఇది అనుకూల.. ప్రతికూల అంశాలను కలిపి చేసే ప్రచార వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.

అంటే.. ఇది ఎలా సాగుతుందని చూస్తే.. టీడీపీకి ఉన్న సోషల్ వింగ్ ఐటీడీపీ. ఈ విభాగంలో.. పనిచేసే కార్యకర్తలు.. షాడో అవతారం ఎత్తుతారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడప గడపకు కార్య క్రమాలకు వెళ్తారు. కానీ ఎక్కడా చెప్పరు.

ఎవరికీ తెలియకుండా.. సాధారణ జనాల్లో కలిసిపోతారు. అంతే కాదు.. ఏం జరుగుతోందనే విషయాన్ని నిశతంగా పరిశీలిస్తారు.  వాటిని వీడియోలు తీస్తారు. ఎమ్మెల్యేలు ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు.

అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్‌ను వీడియో తీస్తారు. ఇలా.. అత్యంత రహస్యంగా ఐటీడీపీ వాళ్లు వీడియోలు తీసి రెడీచేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో.. గత మూడేళ్లుగా.. అంటే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఏం చేశారు?  రహదారుల పరిస్థితి ఎలా.. ఉంది. చెత్తపన్నుపై ప్రజలు ఏమనుకుంటున్నారు. మురుగునీటి శుద్ధి ఎలా ఉంది.. చిన్నచినుకు పడితే.. పాడవుతున్న రహదారులు ఇలా.. అనేక విషయాలను నిశితంగా గమనించి.. వీడియోలు తీస్తారు.

ఒక్క ఎమ్మెల్యే పైనే కాదు.. నియోకవర్గం ఇంచార్జ్‌లపైనా.. ఐటీడీపీ నిఘానేతం సారించనుంది. దీనిని ఎమ్మెల్యేల వారిగా.. డిక్యుమెంటరీని రెడీ చేయనున్నారు. వీటిని వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేలా రూపొంది.. ప్రచారం చేయనున్నారు. ఇలా.. భారీ వ్యూహం అయితే.. టీడీపీ రెడీ చేసుకుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.