Begin typing your search above and press return to search.

భార‌త్ ఆ ప‌ని చేసిందా? చైనా జ‌వాన్ బంధీ వీడియో వైర‌ల్‌

By:  Tupaki Desk   |   31 May 2020 8:06 AM GMT
భార‌త్ ఆ ప‌ని చేసిందా? చైనా జ‌వాన్ బంధీ వీడియో వైర‌ల్‌
X
భార‌త‌దేశం - చైనా మ‌ధ్య ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ముఖ్యంగా లడక్ సమీపంలో భారత్ - చైనా సరిహద్దుల వద్ద భారీగా బ‌ల‌గాలు మొహ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భార‌త్ చైనాపై ప్ర‌తీకార చ‌ర్య‌కు పాల్ప‌డింద‌ని - చైనాకు ఓ చెందిన ఓ జ‌వాన్‌ ను బంధించింది అని వార్త‌లు వ‌స్తున్నాయి. దానికి సంబంధించి ఓ వీడియో కూడా విడుద‌ల అయ్యింది. అయితే అది వాస్త‌వ‌మో కాదో తెలియ‌దు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఆ వీడియో వైర‌ల‌వుతోంది. దీనిపై అటు చైనా.. ఇటు భార‌త్ కూడా స్పందించ‌డం లేదు.

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన దేశ సైనికులకు పిలుపునిచ్చారు. లడక్ సమీపంలో సరిహద్దులకు అవతల చైనా ఆర్మీ పెద్ద ఎత్తున బ‌ల‌గాలను మోహరించింది. యుద్ధ సామగ్రిని కూడా తరలించింది. ఈ నేప‌థ్యంలో యుద్ధం త‌ప్ప‌దేమోన‌నే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ స‌మ‌యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఇండో టిబెట్ సరిహద్దు పోలీసులు చైనా సైనికుడిని బంధించారని, అతణ్ని చితగ్గొట్టి మరీ విడిచి పెట్టారని వార్తలు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు సోషల్ మీడియాలో విస్తృతమ‌య్యాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో క‌నిపిస్తోంది. అయితే ఆ వీడియో ఎప్ప‌టిదో.. ఎక్కడిదో తెలియ‌డం లేదు. దీనిపై భార‌త సైన్యం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ఆ వీడియోలో లడక్ సమీపంలో భారత్, చైనా సరిహద్దుల వద్ద ఫింగర్-4, ఫింగర్-5 ప్రాంతం వద్ద భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చిన చైనా జవాన్లు, ఓ యుద్ధ ట్యాంకును ఐటీబీపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఉంది. యుద్ధ ట్యాంకును భారత జవాన్లు ధ్వంసం చేయడం, చైనా సైనికుడిని బంధించడం వంటివి క‌నిపిస్తున్నాయి. అయితే కొద్దిసేపటి తరువాత ఆ సైనికుడిని విడిచిపెట్లిన‌ట్లు వీడియోలో ఉంది. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై భార‌త నెటిజన్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ జై భార‌త్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చైనీయులకు త‌గిన బుద్ధి చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి