Begin typing your search above and press return to search.

కేంద్ర బడ్జెట్ లో సర్కార్ దూకుడు తగ్గనుందా..?

By:  Tupaki Desk   |   23 Jan 2023 2:31 PM GMT
కేంద్ర బడ్జెట్ లో సర్కార్ దూకుడు తగ్గనుందా..?
X
కేంద్ర బడ్జెట్ పై దేశ ప్రజలందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ పద్దులో ఎలాంటి విషయాలు చేర్చుతారోనని అందరూ ఎదురు చూస్తారు. 2023 బడ్జెడ్ పై అమితాసక్తి నెలకొంది. ఎందుకంటే దీనిని ఎన్నికల బడ్జెట్ గా పేర్కొంటున్నారు. అయితే ప్రైవేటీకరణ విషయంలో సర్కార్ మునుపటి దూకుడు ఉండదని కొందరు ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంతో ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఆదాయం సమకూర్చుకోవాలనుకొని పలు సంస్థలను మార్కెట్లో పెట్టింది. కానీ అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. దీంతో ఈ విషయంలో ఈసారి ఆ విషయాలను చేర్చాలనుకోవడం లేదని తెలుస్తోంది. మరి తాజా బడ్జెడట్ లో సర్కార్ జోక్యం ఎలా ఉండబోతుంది..?

వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. వారసత్వంగా వస్తున్న కొన్ని సంస్థలు నష్టాల బాట పడుతున్నా చూస్తే ఊరుకోం లేదుకదా అని మరోసారి అన్నారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని మోదీ వైఖరి అన్నది అర్థమవుతోంది. కొన్ని సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిస్తూ వస్తున్న మోదీ అందుకు అనుగుణంగానే గత బడ్జెట్ ను రూపొందించారు. కానీ లక్ష్యాన్ని చేరుకోవడం లో మాత్రం విఫలమవుతున్నారు.

లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా(ఎల్ఐసీ) విషయానికొస్తే అందులోని 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా 20,516 కోట్లు ఖజానాలో పడ్డాయి. అలాగే ఓఎన్ జీసీలో ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్ల విక్రయం ద్వారా రూ.3,058 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ సూటి విక్రయం ద్వారా రూ.3,839 కోట్లు సేకరించింది. అయితే ప్రభుత్వం లక్ష్యం వేరు.

ఈ ఏడాది ప్రతిపాదించిన ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ లాంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అది పూర్తి కాలేదు. అంటే వచ్చే ఏడాదికి దానిని మార్చనున్నారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 65 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వచ్చింది కేవలం 13,531 కోట్లు మాత్రమే.

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందు ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రాధాన్యతన సంతరించుకుంది. ఈసారి పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా 40 నుంచి 50 కోట్లకు మించదని అంటున్నారు. ఒకవేళ డిజిన్వెస్ట్ మెంట్ ద్వారా వచ్చే మొత్తం తగ్గినా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

గత కొంతకాలంగా జీఎస్టీ వసూళ్లు 1.4 లక్షల కోట్లకు తగ్గలేదు. అయితే వచ్చే ఏడాదితో మరో బడ్జెట్ కు అవకాశం ఉన్నా అది కొత్త ప్రభుత్వం వచ్చే వరకు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ బడ్జెట్ లో కేంద్ర వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.