కాంగ్రెస్ గ్యారెంటీయేనా?

Thu Mar 30 2023 10:33:32 GMT+0530 (India Standard Time)

Is Congress Ruling Guarantee

తొందరలో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం గ్యారెంటీ అని ఒక సర్వే చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసిన సీ-వోటర్ సంస్ధ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 115-127 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీ 80 సీట్లలోపే పరిమితమవుతుందట. అలాగే జేడీఎస్ కు సుమారు 30 సీట్లు వచ్చే అవకాశముందని తేల్చింది. రాష్ట్రంలోని మొత్తం 224 సీట్లలో కాంగ్రెస్ కు మ్యాగ్జిమమ్ 127 సీట్లంటే కంఫర్టబుల్ మెజారిటితో అధికారంలోకి రావటం ఖాయమనే అనుకోవాలి.
 
2018లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా అధికారంలోకి రావటానికి అవసరమైన సంపూర్ణమైన మెజారిటి మాత్రం దక్కలేదు. అందుకనే రాజకీయ ముఖచిత్రం అస్తవ్యస్ధంగా తయారైంది.బహుశా ఓటర్లు దీన్ని మనసులో ఉంచుకున్నారో ఏమో రాబోయే ఎన్నికల్లో సింగిల్ పార్టీకి అందులోను కాంగ్రెస్ కు మెజారిటి ఇవ్వాలని డిసైడ్ అయినట్లున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలు కూడా ఇచ్చింది కానీ మనం ఇపుడు అంత డీపుగా పోవాల్సిన అవసరంలేదు.

మే 10వ తేదీన జరగబోయే పోలింగ్ లో మాత్రం జనాలు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయబోతున్నట్లు చెప్పారట. ఎందుకంటే బీజేపీ చేసిన క్షుద్రరాజకీయంతో జనాలు అంతగా విసిగిపోయారట. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది బీజేపీ. తాను అధికారంలోకి రావటానికి రెండు పార్టీల్లోని ఎంఎల్ఏలకు ప్రలోభాలకు గురిచేసింది. రెండు పార్టీల నుండి కనీసం 30 మంది ఎంఎల్ఏలను లాక్కుంది.

ఇంత చేసినా స్ధిరమైన నీతిమంతమైన  ప్రభుత్వాన్ని ఇచ్చిందా అంటే అదీ లేదు. ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. మొదటి ఇద్దరిపైన విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై పైన అసమర్ధుడనే ముద్రపడిపోయింది.

సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల వరకు అసలు పూర్తిస్దాయి మంత్రివర్గాన్నే ఏర్పాటుచేయలేకపోయారు. కొందరు మంత్రులు బొమ్మై బాహాటంగానే తిరుగుబాటు లేవదీసినా ఏమీ చేయలేకపోయారు. ఇలాంటివన్నీ బీజేపీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోవటానికి కారణాలయ్యాయి. ఈ వ్యతిరేకతే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవబోతోందని సర్వేలో తేలింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.