చంద్రబాబుకు ధైర్యం లేదా... అసలు వ్యూహం వేరే ఉందా..!

Sat Apr 01 2023 09:54:42 GMT+0530 (India Standard Time)

Is Chandrababu Has No Courage

ఇటీవల సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్కు ఉన్న ధైర్యంలో పావలా వంతు కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని.. కొందరు వాదన లేవదీశారు. దీంతో ఏకీభవించి న వారు కూడా ఉన్నారు. మరికొందరు మాత్రం తప్పుబట్టారు. సరే.. విషయానికి వస్తే... వైసీపీకి వ్యతిరేకం గా.. వ్యవహరించారని.. పార్టీ గీసిన గీత దాటారని ఇటీవల.. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు.దీనిని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. గట్స్ అంటే.. ఇలా ఉండాలి. జగన్ భేష్ అని ఓ వర్గం నెటిజన్లు ప్రశం సల జల్లు కురిపించారు. అదే వేరే పార్టీలో అయితే.. ఎమ్మెల్యేలను సవర దీసేవారని.. వారిని బుజ్జగించే వారని.. కానీ జగన్ మాత్రం వారికి తగిన శాస్తి చేశారని కూడా వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ సమయంలోనే టీడీపీ విషయాన్ని మరికొందరు ప్రస్తావించారు. పార్టీతరఫున టికెట్లు పొంది.. గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలవిషయాన్ని తెరమీదికి తెచ్చారు.

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ తరచుగా చంద్రబాబుపైనా.. నారా లోకేష్పైనా విమర్శలు చేస్తున్నారని.. అయినప్పటికీ.. ఆయనపై చర్యలు తీసుకోలేదని.. కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదని.. మిగిలిన ముగ్గురిని కూడా తిరిగి పార్టీలోకి పిలుస్తున్నారని కొందరు వాదించారు. ఈ పరిణామాల క్రమంలోనే చంద్రబాబుకు ధైర్యం లేదు. అందుకే.. వారిని బుజ్జగిస్తున్నారనే వాదనను తెరమీదికి తెచ్చారు.

అయితే.. వాస్తవానికి చంద్రబాబుకు గట్స్ లేవా?  ఆయనకు ధైర్యం లేకపోవడంతోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వదిలేశారా? అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది.

అయితే.. మెజారిటీ నెటిజన్లు మాత్రం చంద్రబాబు ధైర్యం పక్కన పెడితే.. ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తు న్నారని.. వేటు వేయడం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా.. వారు ఇన్ని చేసినా.. సహిస్తున్నారనే సింపతీని ఆయన సొంతం చేసుకుంటున్నారని.. అనేవారు పెరిగారు. ఇదీ.. సంగతి!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.