వచ్చే ఎన్నికల్లో పొత్తులకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే జనసేన -టీడీపీ పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతాయని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటీవల.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు తమకు జనసేనతో పనిలేదని.. తామే జనసేనకు అవసరమని వ్యాఖ్యానించినట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఆగమేఘాలపై స్పందించిన టీడీపీ.. దీనిని ఖండించింది.
అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ కలిసి పోటీ చేయనుందనే వాదనకు బలం చేకూరినట్టయింది. అయినా కూడా.. చంద్రబాబు మాత్రం.. టీడీపీని బీజేపీతో కలిపి ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.
వైసీపీని డైల్యూట్ చేసి.. ఎట్టి పరిస్థితిలోనూ అధికారం దక్కించుకోవాలనే ఆలోచనతోచంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా.. చంద్రబాబు బీజేపీ మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని కేంద్రం రూ.1000 నాణేన్ని తీసుకురావడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతులు తెలిపారు. నిజానికి గతంలోనే ఈ విషయంలో ఒకసారి చంద్రబాబు అభినం దించారు. కృతజ్ఞతలు కూడా చెప్పారు. మరోసారి అవకాశం రాగానే.. పార్టీ ఆవిర్భావ సభలో ఆయన బీజేపీ కి చేరువయ్యేలా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. ఇక అటు కేంద్రంలోనూ బీజేపీ పవనాలు.. టీడీపీవైపు వీస్తున్నాయి.
పార్లమెంటులో అన్నగారు ఎన్టీఆర్ విగ్రహానికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు అర్పించ డం.. నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నికోబార్ దీవుల్లోమునిసిపాలిటీని దక్కించుకోవ డం.. టీడీపీ ఎంపీలకు విందు ఇవ్వడం వంటివాటిని గమనిస్తే.. బీజేపీ-టీడీపీ మధ్య సఖ్యత బలపడుతోందని అంటున్నారు పరిశీలకులు.
మరి ఇది వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడుతుందో.. లేదో .. చూడాలి. ఎందుకంటే.. బీజేపీలో ఓ వర్గం.. జగన్వైపు ఉండగా.. మరో వైపు.. టీడీపీ వైపు చూస్తుండడమే కారణం.!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.