ఆల్కా హాల్ అతిగా తీసుకుంటే అనర్దాలేంటి? హ్యాం గోవర్ ఎందుకు అవుతుందో తెలుసా..?

Thu Feb 20 2020 09:28:01 GMT+0530 (IST)

Is Alcohol Overprotective? Do you know why there is a hangover ..?

ఈ రోజుల్లో ప్రతీ వ్యక్తి ఆల్కా హాల్ కి ఈజీగా అట్రాక్ట్ అవుతున్నాడు. అయితే ఈ ఆల్కా హాల్ ఎంత మొత్తంలో తీసుకోవాలి? ఎక్కువ మొత్తంలో తీసుకుంటే జరిగే అనర్థాలేంటి? అసలు ఆల్కాహాల్ శరీరానికి అవసరమా? లేదా? హాంగోవర్ ఎందుకవుతుంది? హ్యాం గోవర్ అయితే ఏం చేయాలి? ఆ వివరాలన్నీ ఓ సారి చూస్తే..సాధారణంగా ఆల్కా హాల్  ఒక మోతాదులో తీసుకోవడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. కానీ మోతాదుకు మించి తీసుకుంటే అదే పలు అనర్థాలకు దారితీస్తుంది. అతిగా ఆల్క హాల్ తీసుకోవడం వల్ల మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతిని గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. 

రక్తంలో ఆల్క హాల్ ఓ మెతాదు దాటి తీసుకుంటే మొదట మాటల్లో తేడా వస్తుంది.  శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. నడకలోనూ మార్పు వస్తుంది. ఆలోచించే విచక్షణ కోల్పోయి.. తను చాలా తెలివిగల వ్యక్తినని అనే భావన కలిగిస్తుంది. మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది. మద్యం అతిగా తాగేవారికి ఎక్కువ శక్తి ఆల్క హాల్ నుంచి వస్తుంది కాబట్టి తక్కువ ఆహారం తీసుకుంటారు. అప్పుడు వారికి కెలొరీలు మాత్రమే అందుతాయి తప్ప కీలకమైన ఇతర పోషకాలు అందకపోవడం కారణంగా బరువు పెరుగుతారు. తద్వారా నీరసంగా తయారై అనారోగ్యానికి గురైనట్లుగా కనిపిస్తుంటారు. 

ఇక ఎక్కువ ఆల్కా హాల్ తీసుకోవడం హ్యాం గోవర్ కి కారణమవుతుంది. ఈ హ్యాం గోవర్ తగ్గించేందుకు ఎలాంటి మందులు లేవు. దీనికి నివారణ.. మత్తు దిగేదాకా తాగకుండా విరామం ఇవ్వడమే ఉత్తమైన మార్గం. కాలేయం ఒక గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్క హాల్‌ను విచ్ఛిన్నం చేయగలదు. హ్యాం గోవర్ నుంచి బయటపడాలంటే మరింత ఆల్క హాల్ తాగకుండా ఉండాలి. ఆల్క హాల్ పీయూష గ్రంథిని నిలువరించి వాసోప్రెసిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. సాధారణంగా ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అప్పుడు మీరు తాగే నీళ్ల కంటే ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. అది డీ హైడ్రేషన్ కు దారితీస్తుంది. రక్తంలో నీరు తగ్గడం వల్ల తలనొప్పి వచ్చి పలు ఇబ్బందులకు దారి తీస్తుంది.