Begin typing your search above and press return to search.

వర్షంతో పాటు వచ్చి పడ్డ ఇనుప బంతులు.. అవి ఏమిటో తెలుసా?

By:  Tupaki Desk   |   16 May 2022 11:30 PM GMT
వర్షంతో పాటు వచ్చి పడ్డ ఇనుప బంతులు.. అవి ఏమిటో తెలుసా?
X
ఆకాశం నుంచి రాళ్లు పడుతుంటాయి. రాళ్లు అంటే వడగండ్లు, అంటే ఐస్ ముక్కలు. దానిని రాళ్ల వాన అని కూడా అంటారు. అలాగే కొన్ని చోట్ల కప్పలు పడ్డాయన్న వార్తలు కూడా వినే ఉంటారు. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి చేపలు పడటం కూడా తలెత్తిన వార్తలు వినే ఉంటారు చాలా మంది. అలాగే ఆకాశం నుంచి వస్తువులు కింద పడటం తరచూ అక్కడక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో గ్రహాంతరవాసులు ఉన్నారన్న చర్చ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్ లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

వేకువ జామున ఆకాశంలో ఉరుములు, మెరుపుల మధ్య బంతుల్లాంటి ఆకారంలో ఉన్న భారీ గోళాలు భూమిపైకి దూసుకొచ్చాయి. వాటిని చూసి రైతులు తీవ్రంగా భయపడ్డారు. తీరా సంబంధిత అధికారులకు వార్త తెలియడంతో వారు అక్కడికి వచ్చి అసలు విషయం బయట పెట్టారు. గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాలో ఈ బంతులు పడ్డాయి. జిల్లా పరిధిలోని 3 గ్రామాల్లో భారీ గోళాలు పడటం కలవర పెట్టింది.

అలాగే ఖేడా జిల్లా పరిధిలో శుక్రవారం వేకువ జామున బుల్లెట్ల ఆకారంలో ఉన్న వస్తువులు నేలపై పడ్డాయి. అయితే పొలాల్లో పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. ఈ వస్తువులు శాటిలైట్ కు సంబంధించిన వస్తువులుగా అధికారులు అనుమానించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. గుజరాత్ లో నాలుగు రోజులుగా అంతరిక్షం నుంచి పెద్ద ఇనుప బంతులు పడుతున్నాయి.

బుధవారం రాత్రి నదియాడ్ తాలుకా భూమేల్ గ్రామంలోని ఫౌల్ట్రీ ఫారం సమీపంలో మొదటి సారిగా బుల్లెట్ ఆకారంలో ఉన్న వస్తువు పడిందని ఆ తర్వాత షఇలీ, ఖాన్కువాన్ గ్రామ పొలాల్లో రెండు ఇనుప గుండ్లు పడినట్లు స్థానికులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

పొలాల్లోకి పనులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చిన్న పిల్లలను బడులకు పంపాలన్నా.. సాయంకాల సమయంలో బయటకు పంపాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుందని.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియక చాలా కష్టపడుతున్నామని వివరించారు.

అలాగే రాత్రుళ్లు ఆరు బయట నిద్రించాలంటే కూడా భయంగా ఉందని పేర్కొంటున్నారు. వెంటనే శాస్త్రవేత్తలు ఇవెందుకు పడుతున్నాయి, అసలు ఇలా పడేందుకు కారణం ఏంటి వంటి అంశాల గురించి చెబితే బాగుంటుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.