Begin typing your search above and press return to search.

రాజీవ్ గాంధీ, వాజ్ పేయి, మన్మోహన్ సక్సెస్.. మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూరా..?

By:  Tupaki Desk   |   4 March 2021 10:36 AM GMT
రాజీవ్ గాంధీ, వాజ్ పేయి, మన్మోహన్ సక్సెస్.. మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూరా..?
X
భారతదేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ మొదట్లో బెటర్ అని అనిపించుకున్నారు.. కానీ ఆ తరువాత ధరల పెంపు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ విషయంలో మోడీ మాటలకు పరిమితమవుతున్నారని, చేసే పనులు తక్కువే ఉంటున్నాయని విమర్శిస్తున్నారు. కేవలం ఎన్నికల్లో గెలుపు మీదనే దృష్టి పెడుతూ ప్రజా పాలనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొందరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు పలువురు మేధావులు ఫైర్ అవుతున్నారు. అయితే రాజీవ్ గాంధీ, వాజ్ పేయి, మన్మోహన్ పాలన కంటే మోడీ పాలన సరిగా లేదా..? అన్న ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి.

కాంగ్రెస్ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని మోడీ కంటే నయమంటున్నారు. ఆ రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిందంటే అందుకు రాజీవ్ కారణమే. అంతేకాకుండా ఎగుమతి, దిగుమతుల్లో ఇండియాని డెవలప్ చేయడంలో రాజీవ్ చాలా కష్టపడ్డాడు. సాఫ్ట్ వేర్ రంగం ఈరోజు ఎక్కువగా ఎక్స్ ఫోర్ట్ కావడానికి రాజీవ్ ఎంతో కృషి చేశాడు.

ఆ తర్వాత భారత మాజీ ప్రధాని వాజ్ పేయి పాలన మోడీ పాలన కంటే బాగుందని మేధావులు అంటున్నారు. వాజ్ పేయి హయాంలో దేశం మొత్తం రోడ్లు వేయించిన ఘనత ఆయనది. అలాగే పర్యాటక రంగాన్ని వాజ్ పేయి కాలంలోనే అభివృద్ధి చేశాడంటే ఆయన పాలన తీరును అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిపక్షాల చేత సరైన నాయకుడు అని మెచ్చుకున్న ఏకైక నాయకుడు వాజ్ పేయి.

పదేళ్లపాటు ప్రధాని పీఠంపై కూర్చున్న మన్మోహన్ సింగ్ సైతం కొన్ని సంస్కరణలు చేశాడు. ఆయన కాలంలో ఆర్థికంగా దేశం ఎంతో బాగుండేది. జాతీయాదాయాన్ని పెంచడంలో ఎంతో తోడ్పడ్డారు. ఫైనాన్స్ రంగంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పలు సంస్కరణలు చేపట్టాడు. ప్రభుత్వ రంగ సంస్థలు ఈయన హయాంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు.

అయితే మోడీ పాలన మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉందంటున్నారు. 2014లో ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఆయన హామీలన్నీ మరిచాడంటున్నారు. నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్క భారతీయుడికి రూ.15 లక్షలు అకౌంట్లో వేస్తానని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నాడు. ప్రతీ సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదన్నారు. కేవలం యూత్ ను అట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాను వాడుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని అంటున్నారు. అందుకే రాజీవ్ గాంధీ, వాజ్ పేయి, మన్మోహన్ కంటే మోడీ పాలన ఏమాత్రం బాగాలేదని మేధావులు చర్చించుకుంటున్నారు.