Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ దారుణం : శిక్షణ అనంతరం 600 మంది ప్రెషర్స్ తొలగింపు..

By:  Tupaki Desk   |   7 Feb 2023 9:43 AM GMT
ఇన్ఫోసిస్ దారుణం : శిక్షణ అనంతరం 600 మంది ప్రెషర్స్ తొలగింపు..
X
వారంతా ఉద్యోగంలో చేరి ఏడాది కాలేదు.. ప్రెషర్స్ అయినందు వల్ల కొన్నేళ్ల పాటు ఉద్యోగానికి ఎటువంటి ఢోకా ఉండదని భావించారు.. కానీ అంతలోనే కొలువును కోల్పోయారు.. ఇంటర్నల్ ప్రెషర్ అసెన్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత కానందను 600 మంది ఇప్పుడు రోడ్డున పడ్డారు. ప్రముఖ ఇన్ఫోసిస్ కంపెనీ తాజాగా కొందరు ఫ్రెషర్స్ ఉద్యోగులను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. కంపెనీలు ఉద్యోగులను ఏదో కారణంతో వదులుకుంటున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. గత కొన్ని నెలలుగా కంపెనీలు ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ కూడా చేరడం ఆందోళన రేకెత్తిస్తోంది.

ఇన్నాళ్లు సీనియర్ ఉద్యోగులను వదులుకొని కొత్త ఉద్యోగులను చేర్చుకుంటున్నారన్న ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నైపుణ్యం పేరిట కంపెనీలు ఉద్యోగులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రెషర్స్ ను సైతం వదలడం లేదు. తాజాగా బెంగుళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి పనితీరు సరిగా లేనందునే వారిని వదులుకుంటున్నట్లు పేర్కొంది. అయితే కంపెనీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

కంపెనీ ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి నిర్వహించే ఇంటర్నల్ ఫ్రెషర్ అసెన్మెంట్ ఇన్ఫోసిస్ నిర్వహించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత కానందున 600 మంది ఇంటికి పంపించినట్లు అందులో పనిచేసిన ఉద్యోగులు చెబుతున్నారు. అయితే వీరంతా 8 నెలల కిందట అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నవారేనని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందులో పనిచేస్తున్న మిగతా వారు సైతం తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మరో ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో 452 మందిని ఇంటికి పంపించింది. ఇలా మాంద్యం నుంచి తప్పించుకోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం భయాందోళనగా మారింది. ఇవే కాకుండా ట్విటర్ గూగుల్ సంస్థలు ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఇప్పుడు భారత్ లో కూడా ఉద్యోగాల తొలగిస్తారనే భయం అందరిలో నెలకొనడం ఉత్కంఠగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.