ప్రెగ్నెన్సీ రావాలంటే ఇలా చేయండి

Mon Jul 13 2020 19:30:51 GMT+0530 (IST)

Do this to get pregnancy

కంటి నిద్ర ఉంటే ఏ రోగం రాదని నిపుణులు చెబుతున్నారు. నిద్రతోనే ఆరోగ్యం అంటున్నారు. అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోవాలని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. పగలు కంటే రాత్రిళ్లు నిద్రపోతే మంచి ఆరోగ్యమంటారు.మహిళలకు నిద్రపోతే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా నిద్రపోయే పెళ్లైన మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను రెండింతలు చేస్తుందని అధ్యయనం చెబుతోంది. ఒక రాత్రి 8 గంటల నిద్రతో హార్మోన్లను సమతుల్యం చేస్తోంది. ఒత్తిడిని కూడా తగ్గించి సంతానోత్పత్తిని పెంచుతుందని సైంటిస్టులు తెలిపారు.

ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న మహిళలు మంచి నిద్రపోతే గర్భవతి అయ్యే అవకాశాలు 91శాతం పెరుగుతాయని ఇండిపెండెంట్ స్లీప్ ఎక్స్ పర్ట్ లు తెలిపారు. రాత్రంతా మంచి నిద్ర పోతూ భోజన సమయంలో శృంగారం చేయాలని సూచించారు. రాత్రి 8 గంటల నిద్రపోయిన వారిలో 44శాతం మంది గర్భం దాల్చారని తేల్చారు.ఇక 6 గంటల వరకు నిద్రపోయిన వారు 23శాతంగా ఉన్నారని వివరించారు. తగినంత నిద్రపోవడం వల్లనే హార్మోన్ల సమతుల్యం చేస్తుందని.. ఫలితంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని సైంటిస్టులు తెలిపారు.