టాయ్ లెట్లో హిందూ దేవతల బొమ్మలు..!!

Tue Nov 20 2018 17:14:10 GMT+0530 (IST)

Indian woman slams US pub for Hindu gods on toilet walls

ఇప్పటికే జాతి వివక్ష జాడ్యం అమెరికన్లలో తారాస్థాయికి చేరిందనే పరిణామాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ...తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో హిందు దేవతల బొమ్మలను అవమానిస్తూ అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా న్యూజెర్సీలోని ఓ నైట్ క్లబ్ వాష్ రూములో వేలాడదీసిన దేవతా చిత్రాలపై ఓ భారత సంతతి మహిళ తీవ్రంగా స్పందించింది. అంకితా మిశ్రా బ్రూక్ లిన్ లోని ‘హౌజ్ ఆఫ్ ఎస్’ అనే నైట్ క్లబ్ కు వెళ్ళినప్పుడు అక్కడ దేవతా విగ్రహాల బొమ్మలను టాయిలెట్ వద్ద చూసి ఆ క్లబ్ ఓనర్లకు రాసిన లెటర్‌లో క్లాస్ పీకింది. ‘‘మీ టాయిలెట్ డెకార్ ను మార్చండి అని చెబుతూనే తనకున్న విలువలు ఆత్మగౌరవంపై వివరిస్తూ వారికి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పింది. దీంతో ఆ యాజమాన్యం దిగివచ్చింది.భారత సంతతికి చెందిన అంకితా మిశ్రా అనే మహిళా.. కొద్ది రోజుల క్రితం స్నేహితులతో కలిసి న్యూయార్క్ బష్విక్‌లోని హాస్ ఆఫ్ ఎస్ పబ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి టాయిలెట్ కు వెళ్లిన ఆమె షాక్ కు గురైంది. వెంటనే అక్కడ ఓ సెల్ఫీ దిగి యాజమాన్యానికి ఓ ఈమెయిల్ రాసింది. ``వాష్ రూమ్ లో పేపర్ న్యాప్ కిన్ కోసం వెతుకుతుండగా నాకు నగలు ధరించిన హిందూ దేవతల చిత్రాలు కనిపించాయి. అందులో శివుడు - వినాయక - సరస్వతి - బ్రహ్మ - రాధా కృష్ణ చిత్రాలు టాయిలెట్ పైన వేళ్లాడఃదీసి ఉన్నాయి.  అవి చూసి సైలంట్ గా ఉండలేకపోయా..అందుకే పబ్ ఓనర్లకు హిందువులు తమ సంస్కృతిని వారు ఎక్కడ ఉన్నా ఎంత బాగా పూజిస్తారో...గౌరవిస్తారో  చాలా స్సష్టంగా తెలియచెప్పా. `` అని వివరించారు.

ఆమె మెయిల్‌కు స్పందించిన సదరు పబ్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పడంతో పాటు టాయిలెట్ గోడలపై ఆ చిత్రాలను తొలిగిస్తామని హామీ ఇచ్చారు.  ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రాలును చూసి.. అందంగా ఉన్నాయి కదా అని ఇక్కడ వేయించామని క్షమాపణలు తెలిపారు. ఆ చిత్రాలను తొలిగిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ‘బ్రౌన్ గర్ల్’ అనే మ్యాగజైనులో ప్రస్తావిస్తూ అంకిత మిశ్రా ఓ కథనం రాసింది. ఈ కథనం భారీ స్థాయిలో షేర్ అయింది.