వ్యవసాయ రంగంలో బారత్ విధానం ప్రమాదకరం

Sat Jul 02 2022 20:00:02 GMT+0530 (IST)

Indian policy is dangerous in agriculture sector

వ్యవసాయరంగంలో బారత్ అనుసరిస్తున్న విధానాలు చాలా ప్రమాదకరమైనవని అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపోయారు. ఇలాంటి విధానాలను మానుకోవాలని అర్జంటుగా భారత్ కు గట్టిగా చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కోరారు. ఈ విషయంలో భారత్ తో సంప్రదింపులు జరిపేందుకు అమెరికా అధికారిక కమిటిని నియమించాలని కూడా కోరారు.ఇంతకీ అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఫిర్యాదుఏమిటి ? ఏమిటంటే ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం వస్తు ఉత్పత్తిలో ఆయా దేశాలు 10 శాతం సబ్సిడిని అనుమతిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం బియ్యం గోదుమలతో పాటు అనేక వస్తుత్పత్తిలో 50 శాతానికి పైగా సబ్సిడీని ఇస్తోందట.

దీనివల్ల ఇతర దేశాల వాణిజ్యాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ వాణిజ్యం ఒత్తిడిని తట్టుకునేందుకు అమెరికా కూడా సబ్సిడీలను పెంచటం వల్ల అమెరికన్ మార్కెట్లు దెబ్బతింటున్నాయన్నారు.

భారత్ వల్ల ప్రపంచదేశాల వాణిజ్యంలో అనేక మార్పులు వస్తున్నట్లు మండిపోయారు. భారత్ అనుసరిస్తున్న సబ్సిడీ విధానాల వల్ల ప్రపంచదేశాల వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు.

అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యుల మద్దతుతో వాణిజ్యంలో సబ్సిడీల విషయమై భారత్ తో సంప్రదింపులు జరపాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. ఏకాభిప్రాయం పేరుతో భారత్ కు అమెరికా వంతపాడొద్దని పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆహార కొరతను దృష్టిలో ఉంచుకుని పరిష్కారం కోసం అమెరికా శాస్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకోసం స్ధితిస్ధాపక పరిస్ధితులను నిర్మించటంలో అమెరికా వ్యవసాయం దోహదపడుతుందన్నారు. అయితే భారత్ మాత్రం ప్రపంచ వాణిజ్యంలో తన వ్యవసాయ విధానం సరైనదే అని వాదిస్తుండటంపై కాంగ్రెస్ సభ్యులు ఆక్షేపణ తెలిపారు. తమ రైతు విధానాలను పరిరక్షించుకోవటంలో భాగంగానే భారత్ ఇలాంటి విధానాలను అనుసరిస్తోందని కూడా కాంగ్రెస్ సభ్యులు పదే పదే ప్రస్తావించటం గమనార్హం.