Begin typing your search above and press return to search.

పిల్లలకు లైంగిక వేధింపులు..ఎన్ ఆర్ ఐ అరెస్ట్

By:  Tupaki Desk   |   6 Aug 2018 5:46 AM GMT
పిల్లలకు లైంగిక వేధింపులు..ఎన్ ఆర్ ఐ అరెస్ట్
X
అమెరికాలో భారతీయుడికి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. 28ఏళ్ల అభిజిత్ దాస్ అనే ప్రవాస భారతీయుడు అమెరికాలోని మైనర్ బాలికలు - బాలురకు 1000 సెక్స్ ఫొటోలు - 380 సెక్స్ వీడియోలను చూపించి లైంగిక వేధింపులు చేశాడని కోర్టులో నిరూపితమైంది. అంతేకాదు పలువురు మైనర్లలో లైంగికంగా పాల్గొన్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే అమెరికాలోని కోర్టు అభిజిత్ కు కఠిన శిక్ష విధించింది. 4 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఆ తర్వాత 10 ఏళ్ల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు ఆదేశించింది. అమెరికా చట్టాల ప్రకారం.. పిల్లల హక్కులను కాలరాయడం.. లైంగిక వేధిస్తే కఠిన చర్యలుంటాయి. అందుకే భారతీయుడికి భారీ శిక్ష పడింది.