Begin typing your search above and press return to search.

మూడేళ్ల అరిహా కోసం భారత ప్రభుత్వం జర్మనీని ఎందుకు కోరింది?

By:  Tupaki Desk   |   3 Jun 2023 11:00 AM GMT
మూడేళ్ల అరిహా కోసం భారత ప్రభుత్వం జర్మనీని ఎందుకు కోరింది?
X
కాస్త నిష్ఠూరంగా అనిపించినా.. మన దేశంలో ప్రాణానికి ఉండే విలువ చాలా తక్కువ. కానీ.. ప్రాశ్చత్య దేశాలు అందునా కొన్ని యూరోపియన్ దేశాల్లో చిన్న పిల్లల విషయంలో ఆ ప్రభుత్వం ఎంత కచ్ఛితంగా.. మరెంత కఠినంగా ఉంటాయో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పిల్లల విషయంలో ఏ చిన్న తేడా వచ్చేసినా.. వెంటనే వారి బాధ్యతను స్వీకరించే ఆయా దేశాల ప్రభుత్వ విధానాలు షాకింగ్ ఉంటాయి. అదే.. సమయంలో కొన్నిసందర్భాల్లో వీరి తీరుతో ఆయా తల్లిదండ్రుల తప్పు లేకున్నా.. తీవ్ర ఇక్కట్లకు గురి కావాల్సి ఉంటుంది. అలాంటి ఉదంతమే ఇప్పుడు చెప్పేది.

ముంబయికి చెందిన భవేష్ షా.. ధారా షాలు ఉద్యోగంలో భాగంగా 2018లో జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి అరిహా షా పుట్టింది. దాదాపుగా ఏడాదిన్న రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో ఆడుకుంటూ పై నుంచి కింద పడింది. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. ఆ ప్రమాదంలో చిన్నారి ప్రైవేటు పార్టుకు గాయమైంది. దీంతో.. అక్కడి వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమైంది. దీంతో అధికారులు చిన్నారి అరిహాను తమ సంరక్షణలోకి తీసుకున్నారు.

గడిచిన 20 నెలలుగా అరిహా అధికారుల సంరక్షణలో ఉంటుంది. మనకు మాదిరి కాకుండా.. ఇలాంటి సంరక్షణ కేంద్రాల్లో వసతులు అత్యద్భుతంగా ఉంటాయి. అయితే మాత్రం.. చిన్నారిని వదిలేసి ఏ తల్లిదండ్రులు మాత్రం హ్యాపీగా ఉంటారు. దీంతో. ఆమెను తమకు ఇవ్వాల్సిందిగా దంపతులు కోరినా జర్మనీ ప్రభుత్వం మాత్రం ఇవ్వని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ దంపతుల వీసా గడువు మరో రెండు నెలల్లో ముగిసిపోతున్న వేళ.. తమ పాపను తమకు ఇస్తే భారత్ కు వెళ్లిపోతామని కోరుతున్నారు.

అయినప్పటికీ అక్కడి అధికారుల నుంచి సానుకూల స్పందన రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు భారత దౌత్య అధికారుల్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో భారతవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. మూడేళ్ల అరిహాను జర్మనీ ప్రభుత్వం భారత్ కు పంపాల్సిందిగా కోరింది. చిన్నారి సుదీర్ఘకాలంగా జర్మన్ల సంరక్షణలో ఉండటంతో ఆమెకు సామాజిక.. సాంస్క్రతిక.. భాషాపరమైన హక్కులకు ఉల్లంఘన జరుగుతుందన్నవిషయాన్ని ప్రస్తావిస్తూ.. పాపను భారత్ కు పంపాలని కోరింది. అయితే.. దీనిపై జర్మనీ స్పందించాల్సి ఉంది. ఒక చిన్నారి సంరక్షణ విషయంలోజర్మనీ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.