Begin typing your search above and press return to search.

భారత్ ను శాశ్వతంగా వీడుతున్న కుభేరులు: కారణం ఇదే..

By:  Tupaki Desk   |   4 Dec 2021 4:28 AM GMT
భారత్ ను శాశ్వతంగా వీడుతున్న కుభేరులు: కారణం ఇదే..
X
భారత కుభేరులు విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడ తమ వ్యాపారాన్ని విస్తరించేందకు సొంతదేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇక్కడే పుట్టి.. సగం జీవితాన్ని అనుభవించిన కొందరు విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతున్నారు. అందుకోసం భారత పౌరసత్వాన్నైనా వదులుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. విదేశాల పౌరసత్వం కోసం ఇండియన్ సిటిషన్ షిప్ వదులు కుంటున్నారు.

చదువు.. ఉద్యోగం.. వ్యాపారం కోసం.. ఇతర దేశాలకు వెళ్లే ఇండియన్స్ చాలా మందే ఉంటారు. అయితే కొంత కాలం పాటు అక్కడుండి తిరిగి వచ్చేవారు ఉండగా.. మరి కొందరు మాత్రం అక్కడే సెటిల్ అవుతారు. ఎక్కువగా వ్యాపారం చేసేవారు విదేశాల పౌరసత్వం తీసుకొని ఇక్కడే జీవితాన్ని గడుపుతారు.

ఈ సమయంలో భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది. భారత పౌరసత్వాన్ని వదులుకునైనా విదేశాలకు పయనమయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్లలో 6 లక్షల మంది ఎన్నారైలు ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. ఇండియన్ సిటిజన్ షిప్ వదులుకోవడానికి పెద్ద కారణమే ఉంది.. అదేంటంటే..?

2020 సంవత్సంలో గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ చేసిన రివ్యూలో అనేక విషయాలను తెలిపింది. 2020 ఒక్క సంవత్సరంలోనే భారత్ నుంచి 7 వేల మంది సంపన్నులు ఇతర దేశాలకు తరలిపోయారు. ఒక దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లే వారిలో మనకంటే చైనా ముందంజలో ఉంది. ఈ సంవవత్సంలో చైనా నుంచి 16 వేల మంది విదేశాలకు తరలిపోయారు.

అయితే విదేశాల్లోకి వెళ్లి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని గడపాలనుకునే వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. భారత్ లో కంటే ఇతర దేశాల్లో తమ వ్యాపారం వృద్ధి చెందుతుని భావించి వీరంతా ఇతర దేశాలకు పయనమవుతున్నారు.

ఇతర దేశాల నుంచి వచ్చే వ్యాపారులకు కొన్ని దేశాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాయి. ఇందులో భాగంగా పోర్చుగల్, గ్రీస్, మాల్టా లాంటి దేశాలు ‘గోల్డెన్ వీసా’లను జారీ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి అపర కుభేరులు తమ దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టేవారికి శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాన్నిజారీ చేస్తున్నాయి.

అయితే తొమ్మిది దేశాల్లో మాత్రమే ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. మిగతా దేశాల్లో కొన్నిరోజులు మాత్రమే గడపొచ్చు. కానీ ఈ తొమ్మిది దేశాల్లో సరైన ధ్రువపత్రాలు కల్పిస్తే శాశ్వత వీసా జారీ చేస్తారు. ఈ దీనిని ఆసరాగా చేసుకొని కొందరు ధనవంతులు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఇతర దేశాల్లో శాశ్వత గుర్తింపు పొందితే మనదేశంలో పౌరసత్వాన్ని వదలుకోవాలి. రెండు దేశాల్లో నివాస గుర్తింపు ఉండాలంటే కుదరదు. దీంతో విదేశాల్లో పౌరసత్వం కోసం భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.

అయితే పెట్టిన దేశంపై మమకారం ఉంటుందని భావించే వారికి మరో మార్గం ఉంది. ఇతర దేశాల్లో సెటిల్ అయి గుర్తింపు పొందిన వారు మన దేశంలో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందే అవకాశం ఉంది. దీని ద్వారా ఇతర దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన దేశ పౌరసత్వాన్ని కాపాడుకోవచ్చు.

భారత్ నుంచి కొన్ని దేశాల్లో పెట్టుపెడులు పెట్టడానికి వీసా అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారత పాస్ పోర్టుకు 85వ ర్యాంకు ఉంది. దీని ప్రకారంగా 58 దేశాల్లో భారతీయులు ఎలాంటి వీసా తీసుకోకుండా అక్కడికి వెళ్లి పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఈ అవకాశం ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే అమెరికన్ పాసుపోర్టు ద్వారా 100 దేశాలకు పైగా వెళ్లిక అక్కడ తమ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. దీంతో ఎక్కువగా లాభాలు వచ్చే దేశాలకు వెళ్లడానికి ఇక్కడి పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.