Begin typing your search above and press return to search.

అమెరికాలో థాంక్స్ గివింగ్ రోజున తెలుగు కుటుంబం ఛిన్నాభిన్నం

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:25 AM GMT
అమెరికాలో థాంక్స్ గివింగ్ రోజున తెలుగు కుటుంబం ఛిన్నాభిన్నం
X
అమెరికాలో వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. మందు , విందులతో వీకెండ్ లలో పండుగ చేసుకుంటారు. ఇప్పుడు రాబోయేది డిసెంబర్, న్యూఇయర్ కావడంతో నెలరోజుల ముందుగానే ఈ వేడుకలు జరుగుతాయి. ఇందులో ఆనందంగా పాల్గొని వస్తున్న ఒక తెలుగు కుటుంబాన్ని మృత్యువు ప్రమాదం రూపంలో కబళించింది. అమెరికాలో ఘనంగా జరుపుకునే థాంక్స్ గివింగ్ డే రోజున ఈ విషాదం అలుముకుంది.

థాంక్స్ గివింగ్ డే రోజున మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో తెలుగు దంపతులకు ఘోర ప్రమాదం జరిగింది. వారి వాహనం మరో కారును ఢీకొనడంతో ఆసుపత్రికి తరలించేలోపే అందులో ప్రయాణిస్తున్న తెలుగు మహిళ శ్రీజ మృతి చెందింది.

ఆమె భర్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇప్పటికీ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

అనుకోకుండా మరో ఇద్దరు కారు ప్రమాదానికి గురయ్యారు. అల్టామాంట్ పాస్ మరియు నార్త్ ఫ్రంట్ రోడ్లపై గ్రామీణ అల్మెడ కౌంటీ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. నీలిరంగు హోండా సివిక్ సెడాన్ - సిల్వర్ టయోటా ప్రియస్ కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాయి. పాస్ చేసే ప్రయత్నంలో అదే వేగంతో పశ్చిమ దిశగా వెళ్తున్న టయోటా కారును హోండా సెడాన్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి.

సాధారణంగా థాంక్స్ గివింగ్ రోజున ప్రమాదాలు జరగడానికి మద్యం తాగి వాహనాలు నడపడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పార్టీ చేసుకొని ఇంటికి వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఘటనలో శ్రీజతో పాటు మరో ముగ్గురికి గాయాలు కాగా, అందరూ ఆస్పత్రిలో చేరారు.

మృతురాలు శ్రీజ భర్త పరిస్థితి విషమంగా ఉండగా మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలైనప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన బంధువులు ఈ వార్తలతో కలత చెందారు. శ్రీజ భౌతికకాయం భారతదేశానికి వచ్చేలా మరియు దహన సంస్కారాలు జరిగేలా చూసేందుకు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి పలువురు నిధుల సేకరణ ప్రారంభించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.